నిన్న హైకోర్ట్ లో నవయుగ వేసిన పిటీషన్ పై, జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. జల విద్యుత్ ప్రాజెక్ట్ ను నవయుగకి రద్దు చేస్తూ, కొత్తగా టెండర్ పిలవాలని జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, నవయుగ కోర్ట్ కి వెళ్ళింది. దీని పై విచారణ జరిపిన కోర్ట్, నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, జగన్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ జెన్కో కు, నవయుగకు మధ్య ఒప్పందం జరిగింది కదా, ఏపీ జెన్కో ప్రభుత్వ సంస్థ అయినా, ఒకసారి ఒప్పందం జరిగిన తరువాత, ఏపీ జెన్కో కు సంబంధం ఉంటుంది కాని, ఏపి ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం ఉండదు అని కోర్ట్ తెలిపింది. ఒక వేళ ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చినా, ఏపీ జెన్కో ఒప్పందంలో ఉన్న అంశాలకు మాత్రమే లోబడి ఉండాలని కోర్ట్ చెప్పింది.

court 23082019 2

కాంట్రాక్టర్ కంపెనీ సరిగ్గా పని చెయ్యలేదు అంటున్నారు, దాని పై ఇప్పటికి వరకు చర్చించారా ? సరిదిద్దే ప్రయత్నం చేసారా అని కోర్ట్ ప్రశ్నించింది. ఒప్పందం కనుక ఉల్లంఘన జరిగితే, ఇవన్నీ చెయ్యాలి, మరి ఇక్కడ అది జరిగినట్టు కనిపించటం లేదని కోర్ట్ పేర్కొంది. ఇక మరో పక్క నవయుగ పనుల్లో అసలు పురోగతి లేదు అంటూ, ప్రభుత్వం చేసిన వాదన పై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా ప్రభుత్వం, తప్పుదోవ పట్టించింది అంటూ వ్యాఖ్యలు చేసింది. కాంట్రాక్టు రద్దు చెయ్యాలని ప్రభుత్వం రాసిన లేఖకు, నవయుగ ఒక లేఖ రాసింది, ఆ లేఖ చూస్తే పనులు వేగంగా జరుగుతున్నాయని అర్ధం అవుతుంది కదా అని కోర్ట్ ప్రశ్నించింది. నవయుగ పనులు చెయ్యటంలో పూర్తిగా విఫలం అయ్యింది అంటూ, ఏజీ వాదనలు వినిపించారు.

court 23082019 3

కాని కోర్ట్ మాత్రం, ఆ లేఖ చూపిస్తూ, నవయుగ పనుల్లో గణనీయమైన పురోగతి చూపినట్టు తెలుస్తుంది. ఇంజనీరింగ్‌ పనుల్లో 98 శాతం, సివిల్‌ పనుల్లో 75 శాతం పూర్తయ్యాయని తెలుస్తోంది కదా అని కోర్ట్ ప్రశ్నించింది. మరో పక్క, ఒప్పందంలోని క్లాజ్‌ 13.1 ప్రకారం ఒప్పందం రద్దుకు ఉన్న నిర్దిష్టమైన విధానాన్ని ఇక్కడ పాటించలేదు అని హైకోర్ట్ పేర్కొంది. నవయుగకి కాంట్రాక్టు రద్దు చేస్తూ జెన్కో తీసుకున్న నిర్ణయంలో, చట్ట నిబంధనలకు తగ్గట్లుగా లేవని హైకోర్ట్ పేర్కొంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ విషయంలో జోక్యం చేసుకోవటం పైనా, కోర్ట్ అక్షింతలు వేసింది. ఈ విషయం ఒప్పందం జరిగింది అని, ఏపీ జెన్కో కు నవయుగకి సంబందించిన విషయం అంటూ, కోర్ట్ ఒక రకంగా ఏపి ప్రభుత్వాన్ని తగ్గమని చెప్పింది. మరి ఈ విషయంలో జగన ఏ నిర్ణయం తీసుకొంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read