లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది పారా కిషోర్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధులు వ్యాప్తి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు, తీసుకున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీలను ఆదేశాలు జారీచేసింది. పిల్లో ప్రతివాదులైన వైకాపా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధనరెడ్డి, రోజా, కిల్వేటి సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజనిలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అయితే, ఇప్పటి వరకు, పోలీసులు కాని, ప్రభుత్వం కాని, వీరి పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరి డీజీపీ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
మరో పక్క, నెల్లూరులో, ప్రసన్న కుమార్ రెడ్డి, ఇలాగే లాక్ డౌన్ ఉల్లంఘించారని, కేసు పెడితే, అక్కడ మాత్రం, ఆ ఎమ్మెల్యే ఎదురు, కలెక్టర్, ఎస్పీకే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకుంటే, మీ అంతు చూస్తా అంటూ బెదిరించిన సంగతి తెలిసిందే. ఏకంగా కలెక్టర్, ఎస్పీలేక్ వార్నింగ్ ఇవ్వటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఇక్కడ ఈ ఒక్కరి పై తప్పితే, మిగతా పెద్ద నేతల పై, ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో, కోర్ట్ లో వీరి పై కేసు వెయ్యటంతో, ఈ కేసు విచారణ చేసిన కోర్ట్, అయుదుగురు వైకాపా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధనరెడ్డి, రోజా, కిల్వేటి సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజనిలకు నోటీసులు ఇవ్వాటంతో, ఇప్పుడు వీరు ఏమి సమాధానం చెప్తారో చూడాలి.
తెలుగుదేశం పార్టీ, మొదటి నుంచి కరోనా వ్యాప్తి చేస్తుంది, వైసీపీ నేతలే అని ఆరోపిస్తుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, నేషనల్ పర్మిట్ లారీ లాగా, అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. వందల మందితో, ట్రాక్టర్ ర్యాలీ పెట్టిన, శ్రీకాళహస్తి వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వల్లే, ఈ రోజు శ్రీకాళహస్తిలో ఈ పరిస్థితి వచ్చిందని, ఆరోపిస్తున్నారు. ఇక నగిరి ఎమ్మల్యే రోజా రెడ్డి, ప్రచార పిచ్చతో, ప్రజల చేత, పూలు చల్లింకుంటూ వచ్చిన వీడియో పై కూడా దుమారం రేగింది. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, కర్నూలు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మాదాసి వెంకయ్య, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ , పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, చిలకలూరి పేట ఎమ్మల్యే విడుదల రజినీ పై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.