కాసేపట్లో హైకోర్టులో ఏపీ రాజధాని, సీఆర్డీఏ రద్దు పిటిషన్ల విచారణ జరగనుంది. దీంతో ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పిటిషన్ల విచారణకు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. మొత్తం ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించనున్నారు. అయితే ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని, హైకోర్టుకు చేరుకున్నారు. నిన్న హైకోర్ట్ లో, ఏపీలో అమరావతి తరలింపు, 3 రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టిం ది. వికేంద్రీకరణ బిల్లు రైతుల న్యాయబద్ధమైన ప్ర యోజనాలకు విరుద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపింది. న్యాయ సమీక్ష విధానంలో సమాజ ప్రయోజనాలకు భంగం కలిగే విధానాలను అడ్డుకునే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేసింది. వికేంద్రీ కరణ, సీఆర్డీఏ బిల్లులపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని, ఆ బిల్లులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.
పిటిషన్‌పై తదుపరి విచారణను గురువారం చేపట్టనున్నట్లు వెల్లడించింది. అంతకుముందు వాదనలు వినిపించిన లాయర్ అశోకభాను.. ప్రభుత్వాలు మారినంత మాత్రాన స్టేక్ హోల్డర్లతో చేసుకున్న ఒప్పందాలు మారవని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రాజధాని వికేం ద్రీకరణ బిల్లు తెచ్చారని, కోర్టుకు వివరించారు. సీఆర్డీఏ చట్టం రద్దును కొట్టివేయాలని కోరారు. చట్టసభల ఆమోదం పొందిన తరువాతే వికేంద్రీక రణ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం తరఫున ఏజీ కోర్టుకు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు గతప్రభుత్వంలో ఇచ్చిన హామీల కంటే అదనపు ప్రయో జనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సోమవారం అసెంబ్లీలో పాస్ చేసింది.
ఈ బిల్లు ప్రస్తుతం శాసన మండలిలో ఉంది. ఈ లోగా బిల్లు ఆమోదాన్ని సవాల్ చేస్తూ 37 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక, 3 రాజధానుల కేసు వాదనకు ముకుల్ ని మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభు త్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహల్లిని నియమించింది. ముకుల్ ఫీజు కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తుగా రూ. కోటి అడ్వాన్స్ గా చెల్లించేందుకు అనుమతిలిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అమరావతి తరలింపు కేసులను ముకుల్ పర్యవేక్షణలో ఎదుర్కొవాలని ఏజీకి సర్కారు స్పష్టం చేసింది. మొత్తానికి, ఇప్పుడు అందరి దృష్టి, హైకోర్ట్ లో చెప్తారు అనే విషయం పై, ఉత్కంఠ నెలకొంది.