రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్, రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమకు ప్రభుత్వం సహకరించటం లేదని, నిధులు ఇవ్వటం లేదని, కోర్టులో పిటీషన్ వేసారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, మీకు ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిచటం లేదో చెప్పాలి అంటూ, అదనపు చార్జ్ షీట్ దాఖలు చేయమని కోరారు. దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్, హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పలు విషయాలు ప్రస్తావించింది. మేము కోర్టులో కేసు వేసిన తరువాత, ప్రభుత్వం 39.63 లక్షలు విడుదల చేసిందని తెలిపింది. అయినా ఇంకా ఆరు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. గతంలో ఎస్ఈసి కోసం, న్యాయవాదులను పెట్టుకున్నారని, వారికి బిల్లులు చెల్లించలేదని తెలిపింది. ఈ విషయం పై తాము ప్రభుత్వానికి వివరాలు పంపామని, అలాగే ఈ విషయం పై గవర్నర్ కు కూడా తాము తెలిపామని అఫిడవిట్ లో తెలిపింది. తమకు సహకారం అందించటం లేదని, నిధులు ఇవ్వటం లేదని, ఇలా చేయటం రాజ్యాంగంలో ఉన్న 243కేను ఉల్లంఘన చేయటమే అంటూ, కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా తాము సమర్పించిన అడిషనల్ అఫిడవిట్ లో, జస్టిస్‌ కనగరాజ్‌ ను ఎస్‌ఈసీగా నియమించినప్పుడు, న్యాయవాదులకు చెల్లించాల్సిన వివరాలు కోర్టుకు తెలిపింది.

అందులో తెలిపిన వివరాలు ప్రకారం, జస్టిస్‌ కనగరాజ్‌ తరుపున వాదించటానికి, అలాగే ఇతర ఖర్చుల కింద, సీనియర్ న్యాయవాది అయిన ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ను పెట్టుకున్నారని, ఆయన ఒకసారి హాజరు అయితే, రూ.3.3 లక్షలు ఇవ్వాలని, ఆయన ఈ కేసు విషయమై 16 సార్లు హాజరు అయ్యారని, ఆయనకు రూ.58.70 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఇక అలాగే, ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి తరుపున, మరో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హాజరు అయ్యారని, ఆయనకు రూ.18 లక్షల చెల్లించాలని, అలాగే ఇతర న్యాయవాదుల వివరాలు కూడా చెప్పారు. ఇక ఎన్నికలు ఆపినందుకు, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ తరుపున, హాజరు అయిన న్యావాదికి రూ.10.50 లక్షలు చెల్లించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ సందర్భంగా, న్యాయవాదులు ఫీజులు చుసిన హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇవన్నీ లెక్కేస్తే కోట్ల రూపాయలు అవుతుందని, ఇదంతా ప్రజలు కట్టే సొమ్ము అని, ప్రజల సొమ్ముని ఇలా ఖర్చు చేయటం బాధాకరం అని అన్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, హైదరాబాద్ లో, విజయవాడలో నివాసం ఉండటం పై కూడా కోర్టు కామెంట్ చేస్తూ, రెండు చోట్ల ఎందుకని ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read