ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. మొదటి నుంచి అమరావతి పై విషం చిమ్ముతున్న వైసీపీ, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అమరావతి పై విషం చిమ్మటం ఆపలేదు. ఇందులో భాగంగానే, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, చట్టంలో లోని అంశం ఒకటి తీసుకుని వచ్చి, హడావిడి చేసారు. దీని పై ఇష్టం తమ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిఐడిని ఉపయోగించి, కేసులు పెట్టారు. అయితే ఈ రోజు హైకోర్టులో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ పై, సంచలన తీర్పు ఇచ్చింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, వాదిస్తున్న వచ్చిన ప్రభుత్వానికి, అలాగే ఇటీవల సిఐడి కేసులు కూడా కొట్టివేస్తె, కొద్ది సేపటి క్రితం హైకోర్టు చారిత్రాత్మిక తీర్పుని ఇచ్చింది. రాజధానికి సంబంధించి, కిలారు రాజేష్ అనే వ్యక్తి, గుంటూరులో ఉన్న కొంత మంది, విజయవాడలో ఉన్న మరి కొంత మంది, రాజధాని అమరావతిలో భూములు ముందుగానే కొనుగోలు చేసారని, సిఐడి కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఒక వ్యక్తీ ఫిర్యాదు చేసారని, సిఐడి కేసు నమోదు చేసింది. అప్పట్లో అరెస్ట్ కూడా చేయాలని చూసినా, హైకోర్టు అరెస్ట్ ల పై స్టే ఇచ్చింది. అమరావతి పరిధిలో రాజధాని వస్తుందని, ముందే తెలిసి వీళ్ళు ముందే భూములు కొనుగోలు చేసారని ఆరోపణ మోపారు. అయితే దీని పై వీళ్ళు కోర్టుకు వెళ్లారు. ఈ భూములు తాము ఎప్పుడో కొనుగోలు చేసామని, అదీ కాక, రాజధాని వెలుపల భూములు కొనుగోలు చేసినా, దీనికి సంబంధం ఏమిటి అని కోర్టుని ఆశ్రయించారు.
దీని పై హైకోర్టులో విచారణ జరిగింది. కొద్ది సేపటి క్రితం, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, సిఐడి చేసిన ఆరోపణలు హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసుని కూడా క్వాష్ చేస్తూ తీర్పుని ఇచ్చింది. చట్ట ప్రకారం, ఎవరైనా అమ్మిని వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు, ఏమైనా ఆరోపణలు చేసినా, అది పరిగణలోకి తీసుకోవాలని, ఎవరో బయట వ్యక్తి ఫిర్యాదు చేస్తే, దీన్ని ఎలా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారని వాదించారు. పైగా ఐపీసికి, ఈ ఆక్ట్ వర్తించదని వాదించారు. కొన్న వాళ్ళు ఫిర్యాదు చేయాలి, లేదా అమ్మిన వాళ్ళు ఫిర్యాదు చేయాలి కానీ, ఈ బయట వ్యక్తులు ఎందుకు ఫిర్యాదు చేస్తారు అంటూ కోర్టు ముందు వాదించారు. భారత శిక్షా స్మృతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదని వాదించారు. రాజధాని వస్తుందని తెలిసిన తరువాత, పత్రికల్లో వచ్చిన తరువాత, ఎవరైనా కొనుక్కోవచ్చని వాదించారు. ఇది రాజకీయ కక్ష అంటూ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు అమ్మిన వాళ్ళు ఒక్కరు కూడా కేసు పెట్టలేదని, వాపోయారు. పిటీషనర్ తరుపు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఈ కేసుని కొట్టేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఇక వైసీపీ ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేయటం ఆపి, అమరావతిని అభివృద్ధి చేస్తారో లేదో.