ఏపీ రాజధాని అమరావతిలో ఈరోజు హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం జరగనుంది. హైకోర్టు భవనాన్ని సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరుకానున్నారు. సిటీ కోర్టు కాంప్లెక్స్‌ హైకోర్టుగా సేవలు అందించనుంది. సంప్రదాయ, ఆధునిక ఆకృతుల మేళవింపుతో సిటీ కోర్టు భవన నిర్మాణం జరిగింది. నేలపాడులో 14.2 ఎకరాల్లో రూ.173 కోట్లతో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. 23 కోర్టు హాళ్లలో ఆధునిక వసతులతో సిటీ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగింది. టీమ్‌ వన్‌ సంస్థ బౌద్ధ దేవాలయం ఆకృతి ఉట్టిపడేలా డిజైన్లు రూపొందించగా, ఎల్‌ అండ్‌ టి సంస్థ భవన సముదాయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించింది. ప్రధాన న్యాయ మూర్తి కోర్టు హాలును 2480 చదరపు అడుగు విస్తీర్ణంలో సువిశాలంగా తీర్చిదిద్దారు.

court 03022019 2

23 కోర్టు హాళ్లతో పాటు అనుబంధ కార్యాలయాలు, అడ్వకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదుల అసోసియేషన్‌ హాల్‌, మహిళలకు ప్రత్యేక హాలు, అడ్వకేట్‌ ఛాంబర్‌, వివాద పరిష్కార కేంద్రాలు, లైబ్రరీతో పాటు కోర్టుకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చారు. హైకోర్టు భవన సముదాయాన్ని జ్యుడిషియల్‌ బంగ్లాలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ కాంప్లెక్స్‌, సెంట్రల్‌ పార్కుకు కూతవేటు దూరంలో నిర్మించారు. ఆహ్లాదకర వాతావరణంలో న్యాయ నిపుణులు, కోర్టు సిబ్బంది పని చేసే విధంగా తీర్చిదిద్దారు. న్యాయ మూర్తులు, సిబ్బంది, కక్షిదారుల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీఐపీలు సహా ప్రతి ఒక్కరూ సులభంగా రాకపోకలు సాగించేందుకు రెండు మార్గాలను సిద్ధం చేయడంతో పాటు న్యాయమూర్తులకు ప్రత్యేక మార్గం సిద్ధం చేశారు.

court 03022019 3

దక్షిణ, పడమర మార్గాల ను సిబ్బంది, న్యాయవాదులకు ప్రత్యేకంగా కేటాయించారు. ఉత్తరం వైపు మార్గంలో సాధా రణ ప్రజలు, తూర్పు వైపు న్యాయ మూర్తుల రాకపోకలకు కేటాయిం చారు. కోర్టుకు వచ్చే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు, ప్రాథమిక చికిత్సా కేంద్రం, పోస్టాఫీసును ఏర్పాటు చేశారు. మొదటి, రెండో అంతస్తుల్లో కోర్టు గదులు, అనుబంధంగా న్యాయమూర్తుల కార్యాలయాలు ఉంటాయి. ఆదివారం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శనివారం హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పరిశీలించారు. భద్రత, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read