జగన్ పై కోడి కత్తి దాడి కేసులో ప్రజలందరూ లేవనెత్తిన ప్రశ్నలే, ఈ రోజు కోర్ట్ కూడా అడిగి, మరో ట్విస్ట్ ఇచ్చింది. జగన్ పై కోడి కత్తి దాడి జరిగింది విశాఖ ఎయిర్ పోర్ట్ లో అని అందరికీ తెలిసిందే. అది కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇదే విషయం కోర్ట్ కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఇలాంటి చోట జగన్ పై దాడి కేసులో హత్యా యత్నం జరిగిందన్నప్పుడు గాయపడిన వ్యక్తిని విమానం ఎందుకు ఎక్కనిచ్చారు? వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళనిచ్చారు ? గాయమైన వ్యక్తిని ఎవరి ఆదేశాల ప్రకారం ఫ్లిట్ ఎక్కించారు అని కోర్ట్ ప్రశ్నించింది.
ఈ విషయంలో నిబంధనలు ఏమి చెప్తున్నాయో చెప్పాలని, దీని పై పూర్తి నివేదిక ఇవ్వాలని కోర్ట్ కోరింది. ఈ ప్రశ్నలకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం కాని, CISF కాని, ఎయిర్ పోర్ట్ అథారటీ కాని చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి అనుమానాలే ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనేట్టితే, చంద్రబాబు హేళన చేస్తున్నారని జగన్, పవన్, బీజేపీ విమర్శలు చేసాయి. ఇప్పుడు కోర్ట్ కూడా అదే విషయం అడిగింది. మరో పక్క, వాదనలు విన్న కోర్టు 161 సీఆర్పీసీ కింద, జగన్ మోహన్ రెడ్డి, పోలీసుల విచారణకు ఎందుకు సహకరించలేదని ప్రశ్నించింది.
ఏపీ పోలీసుల దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదని, థర్డ్ పార్టీ ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించాలని జగన్ తరపు న్యాయవాది తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన సిట్ నివేదికను వచ్చే మంగళవారానికి సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. శుక్రవారం పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా జగన్ తరపు న్యాయవాది సివి.మోహన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన జె.శ్రీనివాస్‌కు విశాఖ మూడో మెట్రో పాలిటన్ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.