రాజధాని అమరావతి ప్రాంతం లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సంద ర్భంగా అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం సేకరించిన స్థలాలను ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేస్తూ జీవో నంబర్ 107 జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని అమరావతి పరిరక్షణ సమితి, రైతుల తరఫు న్యాయవాది అశోక్ భాన్ ధర్మాసనానికి వివరించారు. ప్రభుత్వం స్థలాలను పంపిణీ చేస్తామంటూ జీవో జారీ చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో రిజర్వ్ చేసిన ఐదు శాతం భూముల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉందని వివరించారు. పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో ఎక్కడా లేదని, కేవలం నివాసయోగ్యమైన ఇల్లు మాత్రమే ఇవ్వాలని ఉందని న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు.

court 13032020 2

మరోవైపు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని సీఆర్‌డీఏ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. భూకేటాయింపుల నిబంధనలు ప్రకారం ప్రభుత్వం పేదవారికి నివాస స్థలాలు కేటాయించవచ్చని తెలిపారు. సీఆర్ డీఏ చట్టంలో పేర్కొన్న సామాజిక అభివృద్ధిలో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. గత ప్రభుత్వం పేదలకు అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చిందని, ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇరువైపు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, పలు సందర్భాల్లో, ప్రభుత్వాన్ని, పోలీసులని, అక్కడే ఉన్న డీజీపీని కూడా కడిగిపారేసింది.

గతంలో పేదలకు ఇచ్చిన భూములు, మళ్ళీ వారి దగ్గర తీసుకుని, వేరే వారికి ఇవ్వటమా, ఇదేమి పధ్ధతి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ భూములు లాక్కోవద్దు అని ఆందోళన చేస్తున్న పేదల పై, ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెడతారా? మీ తీరు సరి కాదు అంటూ కోర్ట్ తీవ్రంగా వ్యాఖ్యానించింది. పంటలను ధ్వంసం చేస్తూ, జేసీబీలతో దున్నేస్తూ, ఉన్న ఫోటోలు మేము చూసాం, పోలీసులు సహకారంతో, భూములు తీసుకుంటున్నట్టు అర్ధం అవుతుంది, అక్కడ జరిగేది వేరు, మీరు కోర్ట్ కు చెప్పేది వేరు, పోలీసులు తీరు ఇలాగే ఉంటే, కేంద్ర హోం శాఖను జోక్యం చేసుకోమని, వారికి రాస్తాం, కేంద్ర హోం శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుంది అంటూ, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులు రికార్డులు తారు మారు చేస్తూ, పోలీసులు భూములు లాక్కోవటానికి వెళ్తూ, ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ హైకోర్ట్ ఆగహ్రం వ్యక్తం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read