మన రాష్ట్రంలో ఒక బ్యాచ్ ఉంటుంది. కేవలం చంద్రబాబు చేసి ప్రతి పనిని కోర్ట్ కు వెళ్లి అడ్డుపడి, పని లేట్ అయ్యేలా చెయ్యటం. జగన్ పార్టీలో అయితే, ఏకంగా ఒక ఎమ్మెల్యేనే ఆ పని పై ఉంటాడు. ఇలాంటి కోవలో వ్యక్తే, చివరకు శ్రీవారి గుడి పై కూడా అభ్యంతరం చెప్తూ కోర్ట్ కు వెళ్లి, చీవాట్లు తిన్నాడు. అమరావతిలో శ్రీవారి గుడి నిర్మించాలాని ప్రభుత్వం టిటిడి కలిసి నిర్ణయం తీసుకున్నాయి. అమరావతిలో టిటిడి నిధులతో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మిస్తే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. 7 నక్షత్రాల హోటల్, మద్యం దుకాణాలను నిర్మించడం లేదు కదా? అని వ్యాఖ్యానించింది.
అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో రూ.150 కోట్ల తితిదే నిధులతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి చర్యలు ప్రారంభం అయ్యాయని, దీనిని అడ్డుకోవాలంటూ తిరుపతి నివాసి పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.23.10 లక్షలు ఉంటే.. ఎకరా రూ.50 లక్షల చొప్పున 25 ఎకరాల్ని తితిదేకు అధికారులు కేటాయించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి 2014సెప్టెంబరులో తితిదేకు సూచిస్తే.. 2018 నవంబర్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యాజ్యం దాఖలు చేయడం ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దేవాలయం నిర్మాణంపై పురోగతి ఉంటుందని గుర్తుచేసింది. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇది ప్రజాహితం కోసం వేసిన వ్యాజ్యంగా లేదని ప్రచారం కోసం వేసిన దానిలా ఉందని ఘాటు వ్యాఖ్య చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అంతిమంగా జరిమానా విధించకుండా కేవలం వ్యాజ్యాన్ని కొట్టేసింది.