ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో మరో మరొక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే, అనేక సార్లు, హైకోర్ట్ ముందల, ప్రభుత్వానికి అనేక మొట్టికాయలు పడ్డాయి. పీపీఏల దగ్గర నుంచి మొన్నటి రంగుల దాకా, మొత్తంగా 53 సార్లు కోర్ట్ లో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు తాజాగా మరోసారి హైకోర్ట్ లో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు వచ్చాయి. రాష్ట్రంలో గ్రానైట్‌ క్వారీల యజమానులకు, ఈ టైములో నోటీసులు ఇవ్వటం పై, హైకోర్ట్ లో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో, గ్రానైట్‌ క్వారీల వ్యాపారాలు, నిబంధనల ప్రకారం నడుచుకోలేదు అంటూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, సుమారుగా 2500 కోట్ల ఫైన్ వేసారు. దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చింది, గనుల శాఖ. అయితే దీని పై అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. ఇదంతా రాజకీయ పరమైన కక్ష అంటూ, అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ వ్యాపారంలో, ఎక్కువగా తెలుగుదేశం సానుభూతి పరులు ఉండటం, అలాగే కొంత మంది ప్రజా ప్రతినిధులు ఉండటంతో, వారిని లోబరుచుకోవటానికి, ఇలా చేసారు అంటూ, బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలు పక్కన పెడితే, గ్రానైట్‌ క్వారీల వ్యాపారాలు అందరూ, ఈ నోటీసుల పై అప్పట్లోనే కోర్ట్ కు వెళ్లారు. దీంతో హైకోర్ట్, ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి, ఈ నోటీసులు చెల్లవంటు కొట్టేసింది. అయితే ఇప్పుడు కరోనా రావటం, లాక్ డౌన్ లో, అన్ని వ్యాపారాలు ఆగిపోయిన నేపధ్యంలో, గ్రానైట్‌ క్వారీలు కూడా ముతపడిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం, ఈ సమయంలో వారికి నోటీసులు ఇచ్చింది. అయితే, వీరిలో ఒకరు, ఇదేమి అన్యాయం అంటూ, హైకోర్ట్ కు వెళ్లారు.

ఒక పక్క లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారు అంటూ, హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పై, హైకోర్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసింది. గ్రానైట్‌ క్వారీ తరుపున న్యాయవాది, టా వాదనలు వినిపించారు. అయితే, దీని పై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. గతంలో ఇదే విషయంలో మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం, అయినా మీరు మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. అది కూడా ఈ కరోనా లోక్ డౌన్ టైంలో, ఒక పక్క పనులు జరగక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు జరిమానా విధంచటం ఏమిటి ? ఈ నోటీసుల పై, మీరు ఇప్పటికిప్పుడు స్పందించనవసరం లేదు అని గ్రానైట్‌ క్వారీల యజమానులకు చెప్పారు. లాక్ డౌన్ తరువాత, పరిశ్రమలు తెరుసుకున్న తరువాత, దీని పై విచారణ చేస్తాం అని హైకోర్ట్ చెప్పటంతో, జగన్ ప్రభుత్వం, గ్రానైట్‌ క్వారీల పై తీసుకున్న చర్యలు, రెండో సారి వాయిదా పడ్డాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read