ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్ట్ కి రాకుండా ఉండటానికి, జగన్ హై కోర్ట్ లో కేసు వేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కాని హైకోర్టు నిరాకరించింది. ఇంత వరకు బాగానే ఉంది... ఎందుకంటే ఇవన్నీ రొటీన్ గా జగన్ కు జరుగతునే ఉన్నాయి.. ఈ సందర్భంలో కోర్ట్ చేసిన కామెంట్స్ చుస్తే, జగన్ ఎలాంటి వాడో అర్ధమవుతుంది.
- జగన్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలున్నాయి. ఇలాంటి నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతాయి. ఎక్కువ కాలం శిక్షలు విధించే అవకాశమున్న నేరాల్లో నిందితునిగా హాజరు తప్పనిసరి.
- హాజరు మినహాయింపు కోసమే పాదయాత్రను తెరపైకి తెచ్చినట్లు ఉంది.
- నాలుగేళ్ల తర్వాత పాదయాత్ర పేరుతో ఆకస్మికంగా హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారు
- విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే... ఆయన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
- జగన్ బయట ఉంది బెయిల్ మీద. ‘ప్రతి విచారణకు హాజరు కావాల్సిందే’ అనే షరతుపైనే జగన్‌కు బెయిలు వచ్చింది అని మర్చిపోకండి.
కోర్ట్ లు జగన్ విషయంలో ఇంత ఆగ్రహంగా ఉంటే, జగన్ అభిమానాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో, జగన్ మీద ఉన్న కేసులు కొట్టేసారు అని, ప్రచారం చేసుకుంటూ, ఎదో ప్రపంచలో ఉన్నారు. ఇప్పటికైనా మేల్కుంటే, వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తుంది.
Advertisements