ఐటీ గ్రిడ్‌ కంపెనీ ఉద్యోగుల అదృశ్యంపై హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదని సహోద్యోగి అశోక్‌ పిటిషన్‌ వేశారు. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్‌క్రైం వింగ్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌‌ని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సోమవారం ఉదయం 10:30 గంటలకు నలుగురిని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే ఆ నలుగురికి తాము 160 నోటీసు ఇచ్చామని తెలంగాణ పోలీసులు తెలిపారు. కేసు డైరీలో బ్లాంక్‌ పేపర్లు ఉండడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కుటుంబ సభ్యులైనా తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకుని పోలీసులపై ఫిర్యాదు చేయరని హైకోర్టు మండిపడింది. అఫిడవిట్‌తో రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

kcrourt 03032019

ఇది సీన్ టు సీన్ కోర్ట్ లో జరిగింది.. "కంపెనీ పై ఫిర్యాదు వస్తే నలుగురు ఉద్యోగస్తులను ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్టు. వారు నిందితులు కానప్పుడు ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్. వారు నిందితులు కాదు విట్నెస్ మాత్రమే అని చెప్పిన తెలంగాణ పోలీసులు. విట్నెస్ అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్. మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఇవ్వండి అని అడిగిన హై కోర్ట్. ఎటువంటి సమాచారం లేకుండా తెల్ల కాగితాల పై విఆర్ఓ సంతకాలు ఉన్న పేపర్స్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన తెలంగాణ పోలీసులు. ఒక వ్యక్తి,లేదా సంస్థ పై సోదాలు నిర్వహించి, పంచనామా పూర్తి అయిన తరువాత ఆయా విషయాలు పొందుపర్చి...అక్కడే స్థానిక విఆరోఓ సంతకం తీసుకుంటారు.మీరు తెల్ల కాగితాల పై సంతకాలు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన హై కోర్టు. ఇది చూస్తేనే మీ దురుద్దేశం అర్థం అవుతుంది వెంటనే అరెస్ట్ చేసిన నలుగురు ఐటీ ఉద్యోగులను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని తెలంగాణ పోలీసులను ఆదేశించిన హై కోర్టు"

kcrourt 03032019

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దానిపై ఏపీ నుంచి పోలీసులు మాదాపూర్‌కు రావడంతో ఈ సోదాల వ్యవహారం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న ‘సేవా మిత్ర’ మొబైల్‌ యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3 కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందంటూ వైకాపా నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. దీని పై ఆ కంపెనీ కోర్ట్ కి వెళ్ళింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read