ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదార్లను నియమించేలా ఉన్నారని ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండగా, వివిధ శాఖలకు సలహాదారులని ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. సలహాదారుల పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. దేవాదాయశాఖకు సలహాదారుగా నియమితులైన శ్రీకాంత్‍పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత తమ అనుయాయులు, సాక్షి సిబ్బంది, ఇతరత్రా ఆబ్లిగేషన్ ఉన్నవాళ్లందరినీ సలహాదారులుగా నియమించేశారు. కొందరు సలహాదారులైతే నియామకమైన శాఖతో ఎటువంటి సంబంధంలేని వారు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
సలహాదారుల పై హైకోర్టు మొట్టికయాలు... మీకు అంత మంది సలహాదారులు ఎందుకు ?
Advertisements