అధికారంలో ఉంటూ, స్థానిక సంస్థలకు హుషారుగా వెళ్తూ, ప్రతిపక్షాన్ని తోక్కేద్దాం అనుకుంటున్న వేళ, వైసీపీకి ఆదరిపోయే షాక్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టం వచ్చినట్టు, వైసీపీ రంగులు వెయ్యటం పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుని ఈ రోజు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ భవనాలకు వైసీపీ రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలకు, పార్టీ రంగులను, 10 రోజుల్లోగా తొలగించాలని, హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ భవనాలకు సీఎస్ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ కొత్త రంగులు వెయ్యాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను, తమకు రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. అలా చెయ్యని పక్షంలో, సిఎస్ ను బాధ్యలుగా చేస్తామని, హైకోర్ట్ స్పష్టం చేసింది. అలాగే ఆగష్టు 2019లో ఈ రంగుల పై ఇచ్చిన జీవోని కూడా హైకోర్ట్ కొట్టేసింది.
గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్, ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై దాదాపుగా, 2 నెలల నుంచి వాదనాలు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఈ కేసు పై వాదనలు ముగిసిన తరువాత, కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసి, ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. అయితే ఇక్కడ ఏకంగా ఛీఫ్ సెక్రటరీతో పాటుగా, ప్రిన్సిపల్ సెక్రటరీని బాధ్యులను చేస్తూ, కోర్ట్ ఇచ్చిన తీర్పు పై, అధికార వర్గాల్లో సంచలనంగా మారాయి. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపధ్యంలో, 10 రోజుల్లో అన్ని పంచాయతీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఇలా రంగులు మార్చటం కుదురుతుందా లేదా, ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు అధికారులకు టెన్షన్ పట్టుకుంది.
అయితే ఇదే విషయం పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ, ఇదేమీ పెద్ద విషయం కాదు అనే విధంగా రెండు రోజుల క్రితం మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, పార్టీ రంగులు ఉన్న బిల్డింగ్ లో ఎలా ఓటు వేస్తారు అని అడగ్గా, వేసిన రంగులు సంగతి వదిలేసి, కొత్తగా ఏమి రంగులు వెయ్యకుండా చూస్తాం అంటూ, సమాధానం ఇచ్చారు. అయితే, హైకోర్ట్ మాత్రం, ఇందుకు భిన్నంగా, ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలకు, పార్టీ రంగులు ఎందుకు , మీ ఫోటో ఎందుకు, అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తరుపు లాయర్ వాదిస్తూ, అది పార్టీ రంగు కాదు అని చెప్పటంతో, వైసీపీ పార్టీ జెండాను మాకు ఇవ్వండి అంటూ కోర్ట్, చెప్పటం కూడా మనం వాదనలు సమయంలో విన్నాం. ఇప్పుడు 10 రోజుల్లో ఆ రంగులు తొలగించమని కోర్ట్ తీర్పు ఇచ్చింది.