ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అమరావతి ప్రజలకు, ఏపి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిందనే అనుకోవాలి. ఈ రోజు హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు, జగన ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఈ రోజు అమరావతి రాజధానిలో ఇప్పటికే ఉన్న కార్యాలయాలు, వేరే ప్రాంతానికి తరలింపు విషయం పై, ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంలో, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. సరైన పద్దతి లేకుండా, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకుండా, జగన్ కార్యాలయాలు తరలిస్తున్నారు అంటూ, రైతులు హైకోర్ట్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలగే రాజధాని విషయంలో వేసిన బోస్టన్, జీఎన్ రావు, హైపవర్ కమిటీలకు చిట్టా బద్ధత లేదు అంటూ రైతులు కోర్ట్ ను ఆశ్రయించారు. ఇలా అన్ని పిటీషన్ల పై హైకోర్ట్ విచారణ జరిపింది. ముఖ్యంగా, హైకోర్ట్ తరలింపు విషయంలో, పిటీషన్ ను విచారించిన హైకోర్ట్, జగన సర్కార్ తీరు పై, ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై, కర్నూల్ కు హైకోర్ట్ తరలింపు పై, ఈ రోజు హైకోర్ట్ కు వివరణ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.
ప్రభుత్వం తరపు వాదనలు విన్న హైకోర్ట్, ఏపి హైకోర్ట్ ను కర్నూల్ కు తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనకు, మోకాలడ్డింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్న శాశ్వత హైకోర్ట్ పనులు ఆపవద్దంటూ, జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం షాక్ తింది. ఇప్పటికే హైకోర్ట్ ను, కర్నూల్ కు మార్చాలనే ఉద్దేశంలో ఉన్న జగన్ కు ఇది షాక్ అనే చెప్పాలి. మే 23 నుంచి అమరావతిలో అన్ని పనులు ఆగిపోయాయి. హైకోర్ట్ నిర్మాణం పనులు కుడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ నుంచి హైకోర్ట్ ని కర్నూల్ కు తరలించాలని జగన్ అనుకోవటం, కాని హైకోర్ట్ మాత్రం, అమరావతిలో నిర్మాణంలో ఉన్న హైకోర్ట్ పనులు ఆపవద్దు అంటూ, ఆదేశాలు ఇవ్వటంతో, జగన్ నిర్ణయానికి బ్రేక్ పడినట్టే అన్న భావన వ్యక్తం అవుతుంది.
ఇక వాదనల విషయాలకు వస్తే, హైకోర్ట్ ఎందుకు తరలించాలి అంటూ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ, స్థలం లేకనే, కార్యాలయాల తరలింపు చేస్తున్నామని చెప్పారు. పిటీషనర్ తరపు లాయర్ స్పందిస్తూ, ఉమ్మడి హైకోర్టుని అప్పట్లో ఉన్న హైదరాబాద్ అఫ్జల్ గంజ్ ప్రధాన భవనం నుంచి గచ్చిబౌలి కి మార్చాలని, తెలంగాణా ప్రభుత్వం అనుకుంటే, హైకోర్ట్ ఒప్పుకోలేదని, తీర్పు చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని ఇచ్చిన తీర్పును హైకోర్ట్ కు తెలిపారు. విచారణ కొనసాగించాలని, కాని అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్ట్. దీంతో, ఇది జగన్ కు భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి. Source of News: https://tv9telugu.com/high-court-directions-to-government-205766.html