ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పై, హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. జర్నలిస్ట్ లు గొంతు నొక్కుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 2340 ను తెచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవో ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా, కధనాలు రాసినా, సోషల్ మీడియాలో రాసినా, వారి పై కేసులు పెట్టే అధికారాన్ని, సంబంధిత శాఖలకు ఇస్తూ, జీవో జారీ చేసారు. ఫేక్ న్యూస్ అయితే గుర్తించ వచ్చు కాని, రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని రాసే వార్తలు కాని, లేక పొతే ప్రతిష్ట దెబ్బ తీసే వ్యాఖ్యలు కాని, ఎలా నిర్ణయిస్తారు ? అనే దాని పై మాత్రం క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వం పై ఏ మీడియా మీద అయినా కక్ష ఉంటే, ఇది ఉపయోగించి, వారి పై కేసులు పెట్టచ్చు అనేది, జర్నలిస్ట్ లు వాదన. ఈ జీవో వచ్చిన దగ్గర నుంచి అనేక జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేసాయి. జాతీయ స్థాయిలో కూడా, అనేక మంది ఈ చర్యను తప్పుబట్టారు. చివరకు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా కూడా, ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

court 27112019 2

ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. దీంతో ఈ విషయం కోర్ట్ కు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 2340 పై, ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ ను హైకోర్ట్ పరిగణలోకి తీసుకోవటంతో, ఈ రోజు ఈ పిటీషన్ పై వాదనలు జరిగాయి. అయితే ఈ జీవో పై, హైకోర్ట్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. గతంలో రద్దు అయిన జీవోని, ఇప్పుడు రిఫరెన్స్ లోకి తీసుకుని, మరో జీవో ఎలా ఇస్తారు అంటూ, హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ జీవోకి సంబధించిన పూర్తీ వివరాలను కోర్ట్ అడిగింది. జీవో పై పూర్తి సమాచారం ఇవ్వలని, చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ శ్యాం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

court 27112019 3

ఈ కేసు పై, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇలాంటి జీవోనే తీసుకువచ్చారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఇతర జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కలిసి, జాతీయ స్థాయి ఉద్యమం చెయ్యటంతో, ఈ జీవో తనకు తెలియకుండా వచ్చిందని, ఈ జీవో తన దృష్టికి వచ్చిన వెంటనే, ఈ జీవో ను రద్దు చెయ్యాలని, ఆదేశాలు ఇచ్చినట్టు, ఆ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే తన తండ్రి రద్దు చేసిన జీవోని, ఇప్పుడు కొడుకు జగన్ మొహన్ రెడ్డి, మళ్ళీ బయటకు తీసి, కొత్త జీవోగా విడుదల చేసారు. అయితే ఎన్ని ఆందోళనలు చేస్తున్నా, ఆయన మాత్రం వెనక్కు తగ్గటం లేదు. మరి కోర్ట్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read