రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ప్రతి ప్రభుత్వ భవనానికి, ప్రతి పంచాయతీ ఆఫీస్ కు, బ్రిడ్జిలకు, కరెంట్ స్థంబాలకు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏది కనపడితే అది, ప్రతి దానికి వైసీపీ రంగులు వేసేస్తున్నారు. ఇప్పటికే చాలా వేసేసారు కూడా. అయితే ఇది తాము అధికారంలో ఉండగా, కట్టినవి అయితే, వీరు వేసుకున్నా అది ఒక పధ్ధతి, అది కూడా తప్పే అనుకోండి. అయితే ఇవి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినవి, అలాగే చంద్రబాబు హయంలో, వైఎస్ఆర్ హయంలో కట్టిన వాటికి కూడా, జగన్ పార్టీ రంగులు వేసేసారు. అయితే, ఇది తప్పు అని, చాలా మంది చెప్తున్నారు. ఇది రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో, అనవసర ఖర్చు అని చెప్తున్నారు. అంతే కాదు, రేపు పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు వస్తే, ఈ రంగులు అన్నీ చేరిపెయాలని, అప్పుడు ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని, అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందని, అప్పుడు మళ్ళీ సున్నం పూసి, మళ్ళీ రంగులు పూస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

colors 24122019 2

అయితే, ఇది ఇలా ఉండగానే, ఈ విషయం కోర్ట్ కు వెళ్ళింది. గుంటూరు జిల్లా, పల్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి వేసిన రంగుల పై కోర్ట్ కు వెళ్లారు. దీని పై హైకోర్ట్ గుంటూరు కలెక్టర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆయన కోర్ట్ కు చెప్పిన సమాధానంతో, ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ రంగులు వెయ్యమని, తమకు ఆదేశాలు వచ్చాయని, ఆధారాలు చూపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు మూడు రంగులుగా మార్చాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆగస్టు 28న లేఖ పంపించారని, గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. తమకు ఇచ్చిన లేఖలో, ప్రాంచయతీ ఆఫీసులకు, పచ్చ, తెలుపు, నీలం రంగులు వేయాలని కోరారన్నారు.

colors 24122019 3

అలాగే జగన్ మోహన్ రెడ్డి పేరు, ఫొటో కూడా వెయ్యాలని, ఆ ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలతో పల్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి మూడు రంగులు వేశామని, అయితే ఈ పని మధ్యలో ఉండగానే, తమకు ఆదేశాలు రావటంతో, ఆ పనులు ఆపెసమని చెప్పారు. అయితే సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరుపున, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి పసుపురంగు వేసినట్లుంది కానీ, వైసీపీ రంగులు కాదని, పసుపు తెలుగుదేశం జెండా రంగన్నారు. హైకోర్ట్ మాత్రం, ఏ పార్టీ రంగులు అయినా వేయడం తగదని, ఆ వివరాలు ఇస్తే వారికి తగిన ఆదేశాలు ఇస్తామని వ్యాఖ్యానించింది. ఈ పార్టీ రంగులు వేసిన వారికి, బాధ్యులైనవారి పై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read