కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిగా పని చేస్తున్న కె.ప్రభాకరరావుపై హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఆయన పై సుమోటోగా తీసుకుని, కోర్టు ధిక్కరణ చర్యలను చేపట్టాలని హైకోర్టు రిజిస్టార్ ని, హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి కె.ప్రభాకరరావు పాటించకుండా, ధిక్కరించటం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు ఆదేశాలు ఇస్తూ జి.సింగవరం పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ ని, ప్రభాకర్ రావు రద్దు చేసారు. అయితే దీని పై కోర్టుకు వెళ్ళగా, కోర్టు కె.ప్రభాకరరావు ఇచ్చిన ఆదేశాలు కొట్టివేసింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న గ్రామ సచివాలయ నిర్మాణం పై కూడా హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, ఆ నిర్మాణం నిలిపివేయాలని, అలాగే సర్పంచ్ పై ఎలాంటి ఒత్తిడి తేవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు చెప్పినా సరే, సర్పంచ్ చెక్ పవర్ రిలీజ్ చేయకపోవటంతో, హైకోర్టుకు వచ్చి విషయం చెప్పాడు సర్పంచ్. దీంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఆదేశాలు పట్టించిన కారణంగా, పంచాయతీ అధికారి పై చర్యలు తీసుకోవాలి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, సుమోటో కేసుగా నమోదు చేసి, అధికారి పై కోర్టు ధిక్కరణ చర్యలు మొదలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read