ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు అమరావతి కేసు విచారణకు రానుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు, హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ముందుకు, అమరావతి కేసు పై వాదనలు విననున్నారు. గతంలోనే హైకోర్టు రాజధాని పై స్పష్టమైన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి పార్లమెంట్ చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం తీసుకున్న తరువాత, మూడు రాజధానులు అంటూ తీర్మానం చేసే అధికారం, రాష్ట్ర శాసనసభకు లేదని, ఇప్పటికే హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఇస్తూనే, రాజధాని అమరావతి ప్రాంతంలో, మౌలిక వసతుల పనులు మొదలు పెట్టి, అభివృద్ధి పనులు కొనసాగించాలని సీఆర్డీఏకు స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. అయితే ఈ తీర్పు అమలు చేయటం లేదు అంటూ, ఇప్పటికే రైతులు కోర్టు ధిక్కరణ పిటీషన్ ను హైకోర్టుఓ దాఖలు చేసారు. దీని పైన స్పందించిన హైకోర్టు, స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి అంటూ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం గతంలో, తమకు 60 నెలల సమయం కావాలని అఫిడవిట్ వేసింది. అమరావతి పై రిట్ ఆఫ్ కంటిన్యూస్ మాండమస్ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే, హైకోర్టు తీర్పుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వీటి అన్నిటి నేపధ్యంలో, ఈ రోజు హైకోర్ట్ ఏమి చెప్తుంది అనే విషయం పై సామాన్య ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది.
అమరావతి పై, నేడు హైకోర్టులో కీలక విచారణ.. టెన్షన్ తో ఎదురు చూస్తున్న ప్రభుత్వ పెద్దలు..
Advertisements