దావోస్ లో ఆంధ్రప్రదేశ్ పతాకం రెపరెపలాడుతుంది... ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అతిధులు, పెద్ద పెద్ద కంపనీ ప్రతినిధులు, మన ఏపీ లాంజ్ కు వచ్చి, ముఖ్యమంత్రితో భీటీ అయిన తరువాత, మన రాష్ట్రాన్ని పొగడకుండా మాత్రం వెళ్ళటం లేదు... హిటాచీ లాంటి వరల్డ్ క్లాసు కంపెనీ ప్రెసిడెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు గర్వ పడేలా, మనల్ని పొగుడుతున్నారు... మన రాష్ట్రాన్ని మెచ్చుకుంటున్నారు... చంద్రబాబు ఎలాంటి టెక్ ఫ్రెండ్లీ నేత అనేది చెప్తున్నారు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించి, రియల్ టైం పరిపాలన చేస్తున్న విధానం అద్భుతం అంటున్నారు...

hitach 24012018 2

నిన్న హిటాచీతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది... ఒప్పంద కార్యక్రమం జరిగిన తరువాత, ఏపి లాంజ్ లో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్, వీడియో వాల్ ఎలా పని చేస్తుందో చూసారు, హిటాచీ ప్రెసిడెంట్ తొషైకీ హిగషిహర... వారికి దాని పని తనాన్ని వివరించారు ఐఏఎస్ అహ్మద్ బాబు, ఐటి మినిస్టర్ లోకేష్... ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం 1100 అని, దీని ద్వారా నేరుగా ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం జరుగుతున్నాయని, రియల్ టైం గవర్నెన్స్, సియం కోర్ డ్యాష్ బోర్డ్ ద్వారా, సంక్షేమ పధకాల అమలు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు ప్రతి రోజు నేరుగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించటం, ప్రాజెక్ట్ లు లైవ్ ఇవన్నీ చూపించారు...

hitach 24012018 3

ఇవన్నీ చుసిన హిటాచీ ప్రెసిడెంట్ తొషైకీ హిగషిహర మాట్లాడుతూ, ఇలాంటి టెక్నాలజీ మా లాంటి కంపెనీల్లో కూడా లేదు, ఇది చాలా అద్భుతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రాజెక్ట్ అద్భుతంగ ఉంది అంటూ కితాబు ఇచ్చారు... సిటిజన్ లైఫ్ సైకిల్ ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌ అంశంపై హిటాచి సంస్థతో ఏపీఈడీబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)లో తాజా పురోభివృద్ధి, పరిణామాలపై హిగషిహరతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ ఒప్పందంలో భాగంగా హిటాచి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీఆర్‌ఎం సిటిజెన్‌ లైఫ్‌సైకిల్‌ ఇ-గవర్నెర్స్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read