చంద్రబాబు గత వారం రోజులుగా ఒక మాట చెప్తున్నారు... 11 రాష్ట్రాలకు హోదా కొనసాగించారు, మరి మాకెందుకు ఇవ్వలేదు ? హోదాతో సమానమైన, స్పెషల్ ప్యాకేజ్ అంటే ఒప్పుకున్నాం, మరి ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు ? వారికి హోదా ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు... దీని పై, సోము వీర్రాజు, ఆయన స్నేహితుడు జగన్ పార్టీ నేతలు, చంద్రబాబు మాట మార్చాడు అంటూ హంగామా చేస్తున్నారు.... నిజానికి, 2014 నుంచి 2016 సెప్టెంబర్ వరకు, చంద్రబాబు అనేక సందర్భాల్లో కేంద్రం దగ్గరకు వెళ్లి హోదా ఇమ్మని అడిగారు... కింద ఆర్టికల్స్ చూడండి... అయ్యా వీర్రాజు, ఇది జాగ్రత్తగా చదువు, నీ స్నేహితుడు జగన్ కి కూడా చెప్పు.... చంద్రబాబు అప్పుడు హోదా కాదని, ఎందుకు ప్యాకేజీకి ఒప్పుకున్నారో తెలుసా వీర్రాజు ?

modi 23022018 2

హోదా ఇవ్వటానికి కుదరదు...ఇకముందు ఇవ్వరు...ఇప్పుడున్న రాష్ట్రాలకు కాలపరిమితి ముగిసింది...ససేమిరా ఇవ్వటం కుదరదు అంటే గతిలేక ...కేంద్రం మీద ఆధారపడిన దౌర్భాగ్య పరిస్దితుల్లో ..ఎవరైనా ఏమి చేస్తారు..మీరు కడుపు లో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని గ్రహించి ...చచ్చినోడి పెళ్ళికి వచ్చినంత అని ఒప్పుకోవాల్సివచ్చింది.... ఆరోజే మీతో తగాదాకు దిగితే జీతాలు ఇవ్వలేరు..పోలవరం ఆపేస్తారు...పెట్టుబడులకు ఆటంకాలు సృష్టిస్తారు...ఇక్కడ గోతికాడ నక్కలు రడీగా ఉంటాయి...ఎప్పడు చంద్రబాబు పాలన లో విఫలమవుతాడా ....ఎప్పుడు రాష్ట్రం అస్తవ్యస్తం అవుతుందా అని ....ఆనక్కలతో పాటు మీలాంటి వారు హిడెన్ అజెండా తో ఉన్నారని గ్రహించాడు చంద్రబాబు....

modi 23022018 3

మీరెన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా....కియా కంపెనీ ని కొట్టేయాలని మీ గుజరాత్ ప్రధాని చూసినా ....లోటు బడ్జెట్ పూడ్చకపోయినా.. అన్నీ భరించాడు... ఈ మూడున్నర సంవత్సరాల నుండి జనం చూస్తున్నారు, చంద్రబాబుని మీరు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారనేది....చంద్రబాబు ఇవాళ ఒక టీడీపీ ముఖ్యమంత్రో....పార్టీ అధ్యక్షుడో కాదు...జనం దృష్టిలో సేవియర్ ఆఫ్ ఆంధ్రా.... కొంత మంది సైకో బాచ్ ...అలాగే మీలాంటి వారికి నచ్చకపోవచ్చు...కాని ఆంధ్రా జనానికి ఆయన అత్యవసరం... లేకపోతే విదేశాల నుండి, అంతర్జాతీయ న్యాయస్దానాల నుండి నోటీసులిప్పించే బాపతు కాదు... మీ మోసలాను ఎండగడతాం వీర్రాజు... మరోసారి ఈ ఆర్టికల్స్ చదువు... మీరు చంద్రబాబుని, ఈ రాష్ట్ర ప్రజలని ఎలా మోసం చేసారో తెలుస్తుంది... హోదాకి మించిన ప్యాకేజి అని నమ్మించారు... అటు ప్యాకేజి లేదు, హోదా లేదు... అందుకే, మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని అడగటం తప్పా ? ఆర్టికల్ సోర్స్: Asvr గారి ఫేస్బుక్ పోస్ట్ నుంచి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read