ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది... ఎవరికీ ఏమి జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు... ఎస్కార్ట్ వాహనంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం నిలిపేశాడు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లాకు మంత్రి బయలదేరారు. ఒక్కసారి ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ జీపులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కిందకు దిగారు. జీపు పూర్తిగా దగ్ధమైంది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు... చినరాజప్పతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు... చినరాజప్ప పరిస్థితిని దగ్గర ఉండి చూసి, అగ్నిమాపక సిబ్బంది వచ్చే దాకా ఉండి, కార్యక్రమానికి వెళ్ళిపోయారు... అయితే ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే, జీప్ మొత్తం కాలిపోయింది... ఏ మాత్రం డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయినా, లోపల ఉన్న వారికి మంటలు అంటుకునేయి అని ప్రత్యక్షంగా చూసిన వారు అంటున్నారు.,..
ఆకవరపాలెం సర్పానది వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరి, ప్రజలను అక్కడ నుంచి పంపించి, వాహనం అక్కడ నుంచి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న ముఖయంత్రి చంద్రబాబు, చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. ఘటన పై ఆరా తీశారు. పోలీసులతో కూడా మాట్లాడి, ప్రమాదానికి గల కారణాల పై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.