జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజకీయ దాడులు మొదలయ్యాయి. ఈ నెల రోజుల్లో తెలుగుదేశం కార్యకర్తల పై కక్ష సాధింపు ధోరణితో కారాడుతున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం కార్యకర్తల పై, 140 దాడులు జరిగాయి. అలాగే ఈ దాడుల్లో 7 మంది చనిపోయారు. ఇలా రాజకీయ దాడులు ఒక పక్క జరుగుతూ ఉండగానే, రేప్ లు కూడా అధికం అయ్యాయి. ఏకంగా వైఎస్ జగన్ వీరాభిమాని రేప్ లు చేస్తూ ఉండగా, పోలీసులు పట్టుకున్నారు. ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్న సమయంలో, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవటం లేదు. ఈ దాడులు ఏంటి అని ప్రశ్నించిన తెలుగుదేశం నేతల పై ఎదురు దాడి చేస్తున్నారు. మీ హయంలో ఇంత కంటే ఎక్కువే చేసారు, మేము ఇంకా తక్కువ చేస్తున్నాం అంటూ సమర్ధిస్తున్నారు. మరో పక్క జెడ్ + క్యాటగిరీ ఉన్న చంద్రబాబుకి భద్రత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పూర్తిగా తొలగించారు. ఇక తెలుగుదేశం మాజీ ఎమ్మల్యేలు, మంత్రులకు కూడా తొలగించారు. లైఫ్ థ్రెట్ ఉన్న వారికి కూడా భద్రత తొలగించటంతో తెలుగుదేశం నేతలు ఆందోళన చెంద్తున్నారు.
అయితే ఏపిలో గత నెల రోజులుగా జరుగుతున్న, రాజకీయ దాడులు, విధ్వంసాల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించిన తీరు, మరింత ఆందోళనగా ఉంది. ఈ రోజు గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే ప్రతి దాడి దగ్గర మేము కాపలా ఉండలేమని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా దాడులకు గురైనవారు వచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడు తప్పకుండా విచారణ సెహ్సి, చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాడులు జరగాలని తాము కోరుకోవటం లేదని అన్నారు. అయితే రాష్ట్రంలో రక్షణ ఇవ్వాల్సిన హోం మంత్రి, ఇలా వ్యాఖ్యానించటంతో ప్రజలు అవాక్కయ్యారు. దాడి జరిగే ప్రతి చోట కాపలా ఉండలేం, దాడి జరిగిన తరువాత ఫిర్యాదు ఇస్తే స్పందిస్తాం అనటం విని, ప్రజలు షాక్ అయ్యారు.