గత రెండు మూడు రోజులుగా, రాష్ట్రంలో జరుగుతున్న విష ప్రచారం పై, రాష్ట్ర హోమ శాఖ ఒక మెసేజ్ ఇచ్చింది... ఇది రాష్ట్ర ప్రజలకు, హోం శాఖ ఇచ్చిన మెసేజ్ "శ్రీకాకుళం, విజయనగరం, ఇతర జిల్లాల్లో పార్ధీ గ్యాంగ్ సంచరిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అమ్మాయలు, చిన్న పిల్లలను అపహరిస్తున్నారు అని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవి ప్రజలు నమ్మకండి. ఆ తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను భయపెడుతున్న వారి పై, విచారణ చేసి, సరైన ఆక్షన్ తీసుకుంటాం.." అంటూ హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. దొంగలు ఇళ్లల్లో చొరబడి సొత్తు దోచుకోవడంతో పాటు మనషులపై దాడులు చేస్తున్నారని, చిన్న పిల్లలను అపహరించి హత్యలు చేస్తున్నారన్న వదంతులు వాట్సాప్‌ గ్రూపుల్లో వ్యాప్తి చెందటంతో గత కొన్ని రోజులుగా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు..

homeminiser 21052018 2

గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా కర్రల, మారణాయుధాలు చేత పట్టుకుని అర్ధరాత్రి సమయాల్లో కాపలా కాస్తున్నారు. గత మూడు రోజుల నుంచి అరబయట అరుగులపైనే పిల్లా పాపలతో సహా కాపలా కాస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అందోళనకు గురవుతున్నారు. వీధుల్లో అనుమానంగా సంచరిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. బంధువులు, తెలిసినవారు, గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి నిమిషానికి సమాచారం పెట్టడం, మీ పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండడని పదే పదే ఫోనులు చేస్తుండటంతో భయమేస్తోందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

homeminiser 21052018 3

దీంతో పోలీసులు రంగలోకి దిగారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఎలాంటి నరహంతక గ్యాంగ్‌లు రాలేదని, జనం ఆందోళన చెందవద్దని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజల్లో అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి రాష్ట్రమంతా పాకటంతో, ఏకంగా రాష్ట్ర హోం శాఖ కూడా, ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పూర్తి సమాచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు నోటిసులు పంపించామని, అవసరమైతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎవరిపైనా అనుమానాలు ఉంటే పోలీసులకు ఫోన్ చెయ్యాలని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read