రాష్ట్రంలో వైకాపా అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ మార్పులు చేర్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తెదేపా ఘోరపరాజయం చెందడంతో అధినేత చంద్రబాబు నివాసంపై కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని కృష్ణా నది తీరాన గల లింగమనేని ఎస్టేట్‌ లో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. అక్కడే ప్రజా వేదికను నిర్మించి ప్రజల సమస్యలను తెలుసుకో వడం జరిగింది. పార్టీ కార్యక్రమాలను కూడా ఇక్కడ నుంచే నిర్వహించారు. అయితే ఏపిలో తెదేపా ఊహించని రీతిలో ఓటమి పాలు కావడంతో చంద్ర బాబు ఉండవల్లిలోని తాత్కాలిక నివాసంలో ఉంటా రా లేక నివాసాన్ని మారుస్తారా అనే విషయంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.

house 2752019

చంద్రబాబు తాత్కాలిక నివాసంతో పాటు మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాల మరికొన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాలు, రాజకీయ పార్టీనేతల అతిథి గృహాలు కూడా ఉన్నాయి. జగన్‌ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమా ణ స్వీకారం చేసిన అనంతరం అక్రమ కట్టడాలపై తీసుకునే చర్యలలో భాగంగా…. ప్రస్తుతం చంద్ర బాబునాయుడు ఉంటున్న నివాసాన్ని కూడా ఖాళీ చేయిస్తారనే వార్తలు వినవస్తున్నాయి. గతంలో అక్రమ కట్టడాలుగా గుర్తించిన నిర్మాణాలను జల వనరుల శాఖ, రెవెన్యూ శాఖలు తాజాగా నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉంటున్న నివాసం ఖాళీ చేయక తప్పని పరిస్థితులు ఎదురు కానున్నాయి. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు వైకాపా ఈ వ్యూహాన్ని అనుసరిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా కోట్లాది రూపాయల వ్యయంతో చంద్రబాబు నివాసానికి సమీపంలో నిర్మించిన ప్రజావేదిక కూడా ప్రశ్నార్ధకంగా మారనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read