రాష్ట్రంలో గరుడ బ్యాచ్ కు, మరో పని పడింది. ఈ శుక్రవారం, రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ళ పండుగ డైవర్ట్ చెయ్యటనికి రెడీ అవుతున్నారు. చ్చేనెల 2న, రాష్ట్రవ్యాప్తంగా మరోమారు 2 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణం పూర్తయిన పట్టణ ప్రాంతాల్లోని 50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని 1.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. వీటితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలోని హుద్‌-హుద్‌ తుపాను బాధితులకు నిర్మించిన ఇళ్లకు కూడా గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు.

housing 30102018 2

మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6.88 లక్షల ఇళ్లు పూర్తైనట్లు చెప్పారు. జనవరి నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. దేశంలోనే సొంతంగా రాష్ట్రనిధులతో లక్షలాది ఇళ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. మరోమారు గ్రామీణులకు 4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వీటితో కలిపి ఇప్పటివరకు పునాదిపడని మరో లక్ష ఇళ్లకు డిసెంబర్‌లో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒకేసారి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

housing 30102018 3

వడ్డీ రేటు అధికంగా ఉన్నందున హడ్కో నుంచి రుణ సమీకరణపై పునరాలోచిస్తున్నట్లు వెల్లడించారు. మూడు బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయినా ఇటుకల బిల్లు రానివారికి త్వరలోనే ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్టు వివరించారు. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 16,362 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీరికి రూ.2.50 లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. మరో 34 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. నిబంధనల పేరుతో కేంద్రం కావాలనే కొర్రీలు వేస్తూ గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లను మంజూరు చేయడం లేదని విమర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read