ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే షాకులకు సామాన్య ప్రజలే కాదు, ఉన్నత వర్గాల ప్రజలు కూడా బెంబేలెత్తి పోతున్నారు. ఇప్పటికే చిత్ర విచిత్రమైన పన్నులతో, ప్రజల పై భారం మోపిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను, బాత్ రూమ్ పన్ను, ఇంటి పన్ను, కరెంటు చార్జీలు పెరుగుదల, ఇలా ఒకటి కాదు రెండు కాదు, వివిధ రకాలుగా పిండేస్తున్నారు. ఇప్పటికే, వన్ టైం సెటిల్మెంట్ పేరుతో, ప్రజల వద్దకు వస్తున్నారు. బలవంతం లేదు అని చెప్తూనే, ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఈ రోజు పత్రికల్లో వచ్చిన కధనాలు చూస్తే మరో బదుడుకి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో, ప్రతి ఒక్కరి ఇంటి ప్లాన్ సేకరించే పనిని వార్డు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. ఇది ఎందుకో ఏమిటో క్లారిటీ లేదు కానీ, ఇంటి ప్లాన్ కాపీలు అడుగుతూ ఉండటంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన పన్ను విధానంతో, ఇప్పటికే పన్నులు పెరగగా, ఇప్పుడు ఇంటి ప్లాన్లు ఎందుకు అడుగుతున్నారో ప్రజలకు అర్ధం కావటం లేదు. అయితే ఇంటి ప్లాన్ ప్రకారం కాకుండా, ప్లాన్ కు విరుద్ధంగా ఇళ్లు కట్టుకుంటే, వారికి జరిమానా విధించటానికి, ఈ పని చేస్తున్నారని తెలుస్తుంది. సహజంగా నూటికి తొంబై మంది, ఇంటి ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకోరు. దీంతో ఇప్పుడు వీరందరికీ జరిమానా పడే అవకాసం ఉంది. అధికారిక ప్రకటన వచ్చే దాకా, దీని పైన క్లారిటీ లేదనే చెప్పాలి.
రాష్ట్ర ప్రజలకు మరో భారీ షాక్ ? ఇళ్ళ ప్లాన్లు సేకరించాలని ఆదేశాలు...
Advertisements