నిన్న ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్ లో, ఆంధ్రప్రదేశ్ కు ఫస్ట్ ర్యాంక్ రావటం వెనుక, కొన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయి. దీనికి కారణం, చివరి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 3 వ స్థానంలో ఉండటం. కాని చివరకు, ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దీని వెనుక, చంద్రబాబు అనే బ్రాండ్ మీద ఉండే నమ్మకం, భరోసా ఉంది. అవును, మీరు చదివింది నిజం. మనకు మొదటి ర్యాంకు రావటానికి, ఇదే కారణం. చివరి వరకు సాగిన ఉత్కంఠ భరిత పోటీలో మన రాష్ట్రానికే విజయం వరించింది. గత ఏడాది ఏపీ, తెలంగాణ రెండూ సమానమైన మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకోగా... ఈసారి తెలంగాణను నవ్యాంధ్ర వెనక్కి నెట్టింది..

eodb 11072018 2

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌- డీఐపీపీ, ప్రపంచబ్యాంకు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తీసుకొస్తున్న వాణిజ్య సంస్కరణలను గత మూడేళ్లుగా మదింపుచేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాల పరిధిలోని వివిధ నియంత్రణ సంస్థల పనితీరును సంస్కరించి మరింత వేగంగా, సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించేలా చేయడమే ఈ కసరత్తు ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన సంస్కరణల సంఖ్యను గత మూడేళ్లలో 285 నుంచి 372కి పెంచారు. కార్మికులు, పర్యావరణం, అనుమతుల మంజూరు, సింగిల్‌విండో విధానం, నిర్మాణ అనుమతుల మంజూరు, కాంట్రాక్ట్‌ల అమలు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, క్షేత్రస్థాయిపరిశీలన విభాగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా ర్యాంకింగ్‌లకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సంస్కరణల్లో ఎన్నింటిని అమలుచేశామన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పిస్తున్నాయి.

eodb 11072018 3

ఇలా సంస్కరణలు అమలు విషయంలో, మన రాష్ట్రానికి 99.73 స్కోర్ రాగా, తెలంగాణా కు 100 శాతం వచ్చింది. అయితే, ఈ సారి మాత్రం, ర్యాంకింగ్స్ విషయంలో కేవలం సంస్కరణలనే పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకున్న కంపెనీల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని, ఈసారి ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకులకోసం ఈసారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడంవల్ల ప్రభుత్వ సంస్కరణలు వాస్తవంగా అమలవుతున్నాయా? లేదా? అన్న విషయం తెలిసి వచ్చినట్లు డీఐపీపీ కార్యదర్శి పేర్కొన్నారు. దేశంలో సుమారు 50వేల మందితో ముఖాముఖి మాట్లాడించి ఆయా ప్రభుత్వాల తీరుపై అభిప్రాయాలు సేకరించింది. 23 రాష్ట్రాల్లో సుమారు 5వేల మందికిపైగా ప్రైవేటు సెక్టార్‌ వినియోగదారులు, ఇంజినీర్లు, లాయర్లు, ఎలక్ట్రిక్‌ కాంట్రాక్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకొంది. ఇలా వివిధ కంపెనీలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 86.50 స్కోర్ రాగా, తెలంగాణాకు, 83.95 స్కోర్ మాత్రమే వచ్చింది. అందుకే, ఫైనల్ రిజల్ట్ లో మనం ఫస్ట్ వచ్చాం. కంపెనీలు మన రాష్ట్రం పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాయి, చంద్రబాబు ఏ రకంగా కోఆపరేట్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. నాకు ఎవరో రష్యాలో చెప్పారు, మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే కమిషన్ ఇవ్వాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారికి, ఈ రిపోర్ట్ అంకితం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read