గత వారం రోజులుగా, పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలను దారిలోకి తెచ్చుకోవటానికి, చంద్రబాబు పై బీజేపీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేసింది... తొలుత దబాయింపు, బెరింపులకు దిగింది... చంద్రబాబు ఏ మాత్రం తగ్గకపోగా, మరింత దూకుడుగా వెళ్ళటంతో ఆ తర్వాత సంప్రదింపులకు దిగి, చివరకు సముదాయింపులకు దిగింది... 4 రోజుల క్రితం సభలో మొదటిసారి ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో కొందరు పాత్రికేయులతో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

cbn 100220188 2

‘‘ఆయన ఏపీ రాజధానికి 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు కావాలంటారు! అంతడబ్బు ఎక్కడుంది? ఎవరిస్తారు? ఆంధ్రప్రదేశ్‌కు చాలా నిధులిచ్చాం. ఏ పద్దు కింద ఎన్ని ఇచ్చామో లెక్కలు పెడతాం. తర్వాత వాళ్లే ఇబ్బంది పడతారు’’ అంటూ పరోక్షంగా హెచ్చరించారు. రెవెన్యూ లోటును కూడా ఏపీ ఎక్కువ చేసి చూపిస్తోందని, వాళ్లు అడిగినంత ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. ఈ బెదిరింపుల సంగతి తెలిశాక... చంద్రబాబు ఎంపీలతో ఆందోళన మరింత తీవ్రం చేయించారు. దీంతో బీజేపీ నేతలు ‘సంప్రదింపుల’ పర్వం మొదలుపెట్టారు. ఉభయ సభల్లో ప్రధాని ప్రసంగానికి అడ్డుపడకుండా... కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

cbn 100220188 3

సంవత్సరం నుంచి ఒక ముఖ్యమంత్రికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని ఢిల్లీ పెద్దలు, వరుస పెట్టి చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసారు.. మిత్రపక్షంగా ఉంటూ, ప్రధాని ప్రసంగం అడ్డుకుంటే, మా పరువు పోతుంది అని బతిమాలారు... ఢిల్లీ నుంచి బీజేపీ ప్రముఖులు ఎవరు ఫోన్‌చేసినా... ‘ఆందోళనలు విరమిస్తాం. హామీల అమలు బాధ్యత మీరు తీసుకుంటారా’ అని సీఎం సూటిగా ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పలేకపోయారు. విభజన హామీల అమలు బాధ్యత చూస్తున్న రాజ్‌నాథ్‌ గురువారం 3 గంటలపాటు తన కార్యాలయంలో భేటీ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులను పిలిపించి ఒకో హామీ ఏ దశలో ఉందో చర్చించారు.. నిన్న ఏకంగా ఆర్ధిక మంత్రి జైట్లీ రంగంలోకి దిగారు... విభజన హామీల్లో అన్ని విషయాల పై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు... సోమవారం నుంచి, ఒక్కో ప్రకటన రానున్నట్టు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read