వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇద్దరు ఎలా మోడీకి లొంగిపోయారో చూస్తూనే ఉన్నాం... కనీసం మోడీ అనే పేరు ఎత్తటానికి, ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కుంటున్న పరిస్థతిలో మోడీని నిలదీయటానికి, ఇద్దరికీ ధైర్యం చాలట లేదు... కారణాలు ఏంటో మనకు తెలియదు కాని, మొత్తానికి ఇద్దరూ మోడీతో కలిసి గేమ్ ఆడుతున్నారు అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది... మరో పక్క, మోడీ పై పోరాడుతున్న చంద్రబాబుని బలహీన పరుస్తూ, జగన్, పవన్ ఇద్దరూ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు... మళ్ళీ మాకు రాష్ట్రం అంటే ప్రేమ, హోదా మా హక్కు అంటూ కబుర్లు చెప్తారు.. అయితే, గత రెండు రోజులుగా జరిగిన రెండు సంఘటనలు చుస్తే, వీరిద్దరూ ఎలా మోడీకి లొంగిపోయారో అర్ధం అవుతుంది...
మన రాష్ట్రానికి జీవినాడి పోలవరం గురించి మాట్లాడుకుందాం... ఇది మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలుసు.. దీని కోసం చంద్రబాబు, వారంలో ఒక రోజు కేటాయిస్తున్నారు అంటే, ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైనదో అర్ధమవుతుంది... అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో నిన్న కేంద్రం, ముందు ఇస్తాను అన్న డబ్బులు కూడా ఇవ్వకుండా, కోత విధించి డబ్బులు ఇచ్చింది.. దీని పై పవన్ కాని, జగన్ కాని నోరు మెదపలేదు.... చంద్రబాబు మాత్రం అసెంబ్లీ వేదికగా, మోడీని దులిపి పడేసారు... పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత అనుమతించింది. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే కేంద్రం మాట మార్చింది కేంద్రం... పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టి కేవలం రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించింది.... పోలవరం లాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో, ఇంత అన్యాయం జరుగుతుంటే, రాష్ట్రంతో కలిసి కేంద్రం పై పోరాడాల్సింది పోయి, పవన్, జగన్, ఒక్కరు కూడా నోరు ఎత్తటం లేదు...
ఇక ప్రత్యేక హోదా గురించి... దీని గురించి, వీరు ఇద్దరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు... అసలు ప్రత్యేక హోదా పేటెంట్ మాదే అంటూ, మెడలో ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నారు... అలాంటిది, నిన్న ‘హోదా’ జాబితాలోనే ఉన్న సిక్కింతోపాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు మరో 3వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. బుధవారం కేంద్ర మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంది. ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకం-2017 కింద నూతన పారిశ్రామిక యూనిట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పిస్తారు... ‘‘ఇప్పుడు ఎవ్వరికీ హోదా లేదు. అన్ని రాష్ట్రాలూ సమానమే’’ అంటూ నవ్యాంధ్రకు మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకు మా రాష్ట్రానికి అన్యాయం చేసింది అని చంద్రబాబు అసెంబ్లీలో మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, పవన్ కాని, జగన్ కాని, ఈ విషయం పై కనీసం మాట్లాడరు..
నిన్న ఈశాన్య రాష్ట్రాలకు ఏ రాయతీలు అయితే ఇచ్చారో, సరిగ్గా ఈ రాయితీలనే తమకూ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తే, దీని పై సరిగా సమాధానం చెప్పకుండా, అరుణ్ జైట్లీ తన విలేకరుల సమావేశంలో వేరే అంశాలను ప్రస్తావించారు... ఒక్క రాష్ట్రానికి ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని వింత సమాధానం చెప్పారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలకు రాలేదంటూ నెపం వారిపై తోశారు.... దీంతో చంద్రబాబు చివరకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, మోడీ పై యుద్ధం ప్రకటించి, దేశ రాజకీయాల్లోనే ఒక కుదుపు తెచ్చారు... చంద్రబాబుని పక్కన పెట్టండి, సామాన్య ప్రజలు హోదా కోసం ఆందోళన చేస్తున్నారు, విపక్షాలుగా వీరికి బాధ్యత లేదా ? వాళ్లకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వరు ? అని మోడీని అడిగే దమ్ము వీళ్ళకి లేదా ? ఎందుకు వీరిద్దరూ పోలవరం పై, హోదా పై మోడీని నిలదియ్యారు ? మోడీని నిలదీస్తున్న చంద్రబాబని, ఎందుకు బలహీన పరచటానికి చూస్తున్నారు ? నిలదియ్యక పోయినా పరువా లేదు, కనీసం ఒక ఖండన, ఒక ప్రెస్ నోట్ లాంటింది ఇవ్వచ్చుగా ?