నేటి ఆధునిక సమాజంలో ఇల్లు కట్టాలన్నా... పెళ్లి చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహం వారి తల్లిదండ్రులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆడపిల్లలకు సంబంధించి విద్య, వైద్యం, పౌష్టికాహారానికి సంబంధించి పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం...వారి వివాహానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించి... "చంద్రన్న పెళ్లి కానుక' పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది. ఈ పథకం ద్వారా బీసీలకు రూ.35 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, కాపులకు రూ.30 వేలు, మైనారిటీలకు రూ.35వేలు అందించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి...
జిల్లా, మండల సమాఖ్య కార్యాలయాలు, మీ-సేవా కేంద్రాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసారు... అలాగే 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఆధార్ వివరాలతో పేరు నమోదు చేసుకోవచ్చు... పెళ్లి కుదుర్చుకున్న వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి సుమారు రూ. 30 వేలు ఆర్ధికసాయం అందనుంది.... ఇవీ నిబంధనలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.. ప్రజాసాధికారిత సర్వేలో వివరాలు నమోదై ఉండాలి.. వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంనం చేసుకోవాలి... వివాహం నాటికి అమ్మాయికి 18, అబ్బా యికి 21 సంవత్సరాలు ఉండాలి... తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డులతో పాటు కుల, జనన, నివాస, ధ్రువపత్రాలు సమర్పించాలి... దివ్యాంగులకు సదరం ధ్రువపత్రం తప్పనిసరి....
వధూవరులు ధ్రువపత్రాలను కల్యాణ మిత్రలకు అందిస్తే, వారు వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తారు.. వివాహ సమయంలో వచ్చి వధూవరుల ఫొటోలు తీస్తారు... అనంతరం తక్షణ సాయం కింద ప్రభుత్వం మంజూరు చేసే నగదులో 20 శాతం నగదు రూపంలో, మిగిలిన 80 శాతం వధువు బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది... పేద కుటుంబాలకు చెందిన షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, దివ్యంగులు, అసంఘటిట కార్మిక కుటుంబాల వారు ఈ పధకానికి అర్హులు...