కేంద్రంతో సవ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి ఏమి చెయ్యలేదు, అలాంటిది కేంద్రంతో యుద్ధం మొదలు పెట్టిన తరువాత, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం ఏమి కాదు... దీనికి ఉదాహరణ, 350 కోట్లు మన రాష్ట్ర ఎకౌంటులో వేసినట్టే వేసి, ఆ డబ్బులు వెనక్కు తీసుకోవటం... ఇప్పుడు మరో అతి పెద్ద ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ కు, కొర్రీలు పెట్టింది కేంద్రం... మిమ్మల్ని ఎలా టార్చర్ పెడతామో చూడండి అని చెప్పినట్టే, మొదలు పెట్టింది... రాయలసీమ నుంచి, అమరావతికి ఐదారుగంటల్లోనే వచ్చేలా, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే ప్లాన్ చేసారు చంద్రబాబు... దీని పై అప్పట్లో కేంద్రం కూడా సుముఖత చూపింది...

 ananta 31032018 1

పూర్తిగా కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చింది... కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ విశాఖలో జరిగిన సభలో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పారు... కాని, ఇప్పుడు ప్లేట్ మార్చటం మొదలు పెట్టింది... కొత్త రాజధానిని అనుసంధానించే ప్రాజెక్టు కాబట్టి, మౌలిక సదుపాయాలన వ్యయంలో భాగంగా కేంద్రమే భరించాలని రాష్ట్రం కోరింది. అదేం కుదరదు, భూసేకరణ ఖర్చు రూ.2500 కోట్లు మీరే భరించాలని గత ఏడాది కొర్రీ వేశారు. అలాగే, రహదారిని తొలుత రెగ్యులర్‌ ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల్లో భాగంగా చేపడతామన్నారు. ఆ తర్వాత... మాటమార్చి ‘భారత్‌ మాల’లో చేరుస్తామని, దీనికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

 ananta 31032018 1

అయితే, ఇప్పుడు మరో జర్క్ ఇచ్చింది కేంద్రం... ఎక్స్‌ప్రె్‌సవే వెడల్పు మరీ ఎక్కువయిందని, దాన్ని సగానికి తగ్గించాలని ఆదేశించింది... ఎలాంటి మలుపులు, మెలికలు లేకుండా ఎనిమిది వరుసల్లో నిర్మించాలని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా...ఐదారుగంటల్లోనే అనంతపురం నుంచి అమరావతికి చేరేలా ఉండాలని రాష్ట్రం ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించింది... అయితే, రహదారి వెడల్పును గతంలో ప్రతిపాదించినట్లు 200 మీటర్లు కాకుండా... వంద మీటర్లకు తగ్గించుకోవాలని కేంద్రం సమాధానం పంపింది... ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ విషయంలో కేంద్రంతో ఘర్షణకు వెళ్తే... మొత్తం ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆచితూచి స్పందిస్తోంది. 100 మీటర్ల వెడల్పుతోనే ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మించేలా మరోసారి డీపీఆర్‌ తయారు చేయించాలని నిర్ణయించింది. అయితే, ఈ తాజా కొర్రీ నేపధ్యంలో, ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది... మనం డీపీఆర్‌ ఇస్తే, మళ్ళీ ఏ కొర్రీ కేంద్రం పెట్టదు అనే గ్యారెంటీ లేదు... కచ్చితంగా పెడుతుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read