తెలంగాణ లో ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడ్డాయి...మొత్తం తప్పుల తడక 50 వేల మంది మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యారు...ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జిల్లా టాపర్ అయిన ఒక అమ్మాయికి తెలుగు లో 98 మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం ఆ అమ్మాయి తెలుగులో ఫెయిల్ అయ్యింది... ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు...ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు ఏంటో తెలుసా ఇంటర్మీడియెట్ బోర్డు వైఫల్యం అది కూడా కొన్ని మీడియా సంస్థల్లో మాత్రమే... ఇదే ఘటన ఆంద్రప్రదేశ్ లో జరిగితే మీడియా బోర్డు తప్పిదం అని వార్తలురాసేవా? చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం...17 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు... మ్యాథ్స్ రాని ఏపీ ప్రభుత్వం అని వార్తలు వచ్చేవి...ఇంతకీ తెలంగాణ లో జరిగింది ఏంటి ?10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ని పొట్టన పెట్టుకుంది ఎవరో తెలుసా ? ఘనత వహించిన కేటీఆర్... అయన ఈ మధ్య లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా?డేటా దొంగలు దొరికారు అబ్బా, కొడుకు జైలుకే ...ఈవీయం మెషిన్ల ను టాంపరింగ్ చెయ్యడం అసాధ్యం...టెక్నాలజీ కనిపెట్టిన చంద్రబాబు ఈవీయం మెషిన్లకు బయపడుతున్నాడు... బాబు ఇక ఇంటికే అని కేటీఆర్ చిట్ చాట్ చేయడం మీడియా వాటిని హెడ్ లైన్స్ లో ఇవ్వడం అందరం చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈవీయం మెషిన్ల ను టాంపరింగ్ చెయ్యోచ్చు అని కేసీఆర్ స్వయంగా అన్న విషయం మీడియా కి తెలియదా?ఇక ఇంటర్మీడియేట్ ఫలితాలకు కేటీఆర్ కి లింక్ ఏంటి అనేగా మీ అనుమానం? హైదరాబాద్ లో ఎన్నో గొప్ప ఐటీ స‌ర్వీసెస్ అందించే సంస్థలు ఉన్నాయి వారికీ కాకుండా గ్లోబరేనా అనే సంస్థ కి ఇంటర్ ఫలితాల విడుదల చేసే టెండర్ దక్కింది.

ఇది కేటీఆర్ ప్రోద్బలంతో జరిగింది అనేది తెలంగాణ పౌర సమాజం ఎరిగిన సత్యం. ఫలితాల విడుదల కి డేటా ఎంతో కీలకం... అదే డేటా అంటే తెలంగాణ పోలీసులు సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర పోయింది అని వెతుకుతున్నారే అదే. ఇంటర్ ఫలితాలు అయినా, పెట్రోల్ బ్యాంకులో పెట్రోల్ కొట్టించుకున్నా ఇప్పుడు ప్రతిదీ డేటా మీద ఆధారపడి ఉంటుంది...పేరున్న సంస్థలకు ఇస్తే ఉన్న డేటా ని ఒక పద్ధతి ప్రకారం క్రోడీకరించి ఫలితాలు ఇచ్చే వారు కానీ కేటీఆర్ కి పాపం డేటా అంటే తెలియదు అతనికి తెలిసింది సెంటిమెంట్ రాజకీయం...తీగ కట్ చేస్తాం అంటూ మీడియా ని బెదిరించడం...అసలు డేటా గురించి కనీస అవగాహన లేని ఒక కంపెనీ కి బాధ్యత అప్పగించి 10 లక్షల మంది విద్యార్థులు,తల్లితండ్రులు ఉసురు పోసుకున్న వారు మీడియా కు చాలా తెలివైన వాడిగా కనిపిస్తారు. 18 మంది చనిపోతే ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన మీడియా ఎందుకు సైలెంట్ గా ఉంది ? ఇక్కడే మరో ప్రశ్న ఉంది ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ని ఒక ఘనత వహించిన యాంకర్ మీరు తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు మిమ్మల్ని పప్పు అంటున్నారు..దీనిపై మీ స్పంద‌న ఏంటి అని దైర్యంగా ప్రశ్న అడిగాడు. త‌ల‌పండిన ఈ జ‌ర్న‌లిస్టు క‌మ్ యాంక‌ర్ మ‌థించి, ఎంతో అధ్య‌య‌నం చేసి మ‌రీ లోకేశ్‌ని అడిగిన ప్ర‌శ్న ఇది. దీనికి లోకేశ్ చాలా హుందాగా స్పందించాడు. లోకేశ్‌ని అడిగిన‌ట్టే..జ‌గ‌న్‌ని నువ్వు ల‌క్ష‌ల కోట్లు కొట్టేశావు క‌దా! అని అడ‌గ‌గ‌ల‌డా ఆ జ‌ర్న‌లిస్ట్ క‌మ్ యాంక‌ర్‌. దొర‌గారూ! మీ రాజ్యంలో 17 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు దీనిపై మీరేమంటారు? అని నిల‌దీయ‌గ‌ల‌డా? దొర‌గారి వ‌ర‌కూ అక్క‌ర్లేదు.. ఆయ‌న మ‌నుమ‌డు అదేనండి కేటీఆర్ కొడుకుని..బాబూ నువ్వు ఇలా ప‌ప్పులా త‌యార‌య్యావెందుకు? అని అడిగే ద‌మ్ముందా? అందుకే ఇటువంటి జ‌ర్న‌లిస్టుల‌ను ఎంతో ఉన్న‌త‌మైన వ్య‌క్తితం ఉన్న‌ వ్య‌భిచారుల‌తో పోల్చ‌డం నాక‌స్స‌లు ఇషంలేదు, అందుకే విటుల‌తో పోల్చాను. అయ్యా మీరు యాంక‌రా? దొర‌గారి ద‌గ్గ‌ర ప‌నిచేసే బ్రోక‌రా? మిమ్మ‌ల్నీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా.. టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఐటీ శాఖ నుంచే అనుమతులు ఇవ్వాలి. మరి 10 లక్షల మంది ఇంట‌ర్ మీడియ‌ట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న స‌ద‌రు కంపెనీకి అనుమ‌తి ఇచ్చింది అప్ప‌టి ఐటీ మంత్రి కేటీఆర్ గారు క‌దా యాంక‌ర్ గారు..ఆయ‌న‌ని ఈ త‌ప్పు మీదేనా? సిన్న‌దొరా! నీ కాల్మొక్తా బాంఛ‌న్ అని అడ‌గ‌గ‌ల‌వా?

ఆ పిల్లలు ఇప్పుడు ఉన్నత పరీక్షలు, దేశ స్థాయి లో జరిగే ఎంట్రన్స్ పరీక్షలు ఎలా రాస్తారు?డేటా గురించి మీకు కనీస అవగాహన లేదా? కేటీఆర్ గారూ మీరు కాదా అసలు పప్పు అని మీ మ‌న‌సులోనైనా(ఎవ‌రికీ విన‌ప‌డ‌కుండా) ప్ర‌శ్నించే ద‌మ్ముందా? ఒక్కో మీడియా సంస్థ‌కీ ఒక్కో ట్యాగ్‌లైన్‌. మేము దేశాన్ని, ప్రజల్ని ఉద్దరించడానికి వచ్చాం అన్న మీడియా సంస్థలకు తెలంగాణలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు, తల్లితండ్రుల గుండెకోత ఎందుకు క‌న‌ప‌డ‌టంలేదు. ఇదే ఏపీలో ఒక్క విద్యార్థి ఆత్మ‌హ‌త్య జ‌రిగితే..మంత్రి నారాయ‌ణ‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు..ఆయ‌న‌కు వెన్నుద‌న్నుగా ఉన్న‌ది చంద్ర‌బాబే నంటూ స్పెష‌ల్ స్టోరీలు..చివ‌రికి బాత్రూమ్‌లో బాబాయ్ చంపేసి, గుండె పోటు అని తానే ప్ర‌క‌టించినా చంద్ర‌బాబుపైకి వేలెత్తి చూపించే తెగులు మీడియా.. టీడీపీ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్లో ఆవు బొడ్డు చూసి...ఏదో అనుకుని ఎద్దని ప్ర‌చారం చేసి మొద్దు మీడియా మొఖాళ్లారా! తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌లో ఒక భార్య‌, భ‌ర్త‌లు వేరుగా వేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై ఆ ఆడ‌పడుచు మ‌నోవేద‌న‌ను ఎందుకు ప్ర‌చురించ‌లేదు. ఆమెకు తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన అన్యాయంపై చ‌ర్చ‌లు ఎందుకు పెట్ట‌లేదు. ఆవుని ఎద్ద‌ని న‌మ్మించేందుకు ముందుకొచ్చిన ఎద‌వ‌లారా... ప్ర‌భుత్వ‌మే జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఒక ఆడ‌కూతురికి అన్యాయం జ‌రిగితే... ఎక్క‌డుతున్నార‌య్యా! తెగులు జ‌ర్న‌లిస్టుల‌న‌బ‌డే ఎర్న‌లిస్టులూ! ఇప్పుడు చంద్రబాబు సౌమ్యుడు మనం ఏమి చేసినా చెల్లుతుంది అనుకోవచ్చు. ఏదో ఒక రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ తెలంగాణ‌ లాంటి ముఖ్య‌మంత్రి వ‌స్తే మీ ప‌రిస్థితి ఏంటి? ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కి కనీస గౌరవం ఇవ్వాలి. లేకుంటే మా వార్తలు ఇవ్వాల్సిన అవసరం లేదు. హైద‌రాబాద్ కేంద్రంగా చిన‌జీయ‌ర్ కి కేసీఆర్ పాదాభివంద‌నాల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌తో త‌రిస్తూ ఉండండి.. ఎంతో బాధ, కోపంతో... ఒక ఆంధ్రుడు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read