కర్ణాటక రాజకీయం హైదరాబాద్‌కు మారింది. బల నిరూపణ కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండటంతో ఆ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేసిన జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు గురువారం ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడకు పాల్పడిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆరోపించాయి. అనంతరం రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు.

karnataka 1805218

ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తరలించారు. అయితే వారందరినీ ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు. చివరకు వారిని హైదరాబాద్ తరలించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన క్యాంపునకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికైన ఎమ్మెల్యేల బృందానికి డీకే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల బస ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

karnataka 1805218

కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు భాజపా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌.. తమ సభ్యులను ఎలాగైనా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కెసిఆర్, బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనే అనుమానాలు ఉన్నా, తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మాత్రం, మేము వారి బారి నుంచి కాపాడతామని, హై కమాండ్ కు చెప్పినట్టు తెలుస్తుంది. మరి వారు అమిత్ షా బారిన పడకుండా, కాపాడుకుంటారో లేదో చూడాలి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read