ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైల్ కు, మన రాష్ట్రంలోని కడప జిల్లాకు సంబంధం ఉంది... కాని ఇవి మన హైదరాబాద్ మీడియా చూపించదు... మన కడప జిల్లా యంత్రాంగం పత్రికా ప్రకటన ఇస్తేనే ప్రపంచానికి తెలిసింది... మొదటి హైదరాబాద్ మెట్రో రైల్ నడిపిన సారధుల్లో కడప జిల్లాకు చెందిన అమ్మాయి ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వ కారణం... ఒక మహిళ, అదీ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావటంతో, ఈ విషయం రాష్ట్రంలో ఆసక్తి కలిగించింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం వేపరాల గ్రామానికి చెందిన గ్రీష్మ హైదరాబాద్ మెట్రోరైల్ నడపటం మనకు ఎంతో గర్వ కారణం...
ఈ విషయం వెలుగులోకి రావటంతో, అసెంబ్లీ లాబీల్లో ఉన్న మన ఎమ్మెల్యేలు సంతోష పడ్డారు. మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి ప్రధాని ఎక్కిన మెట్రో రైల్కు ఒక డ్రైవర్గా ఉండటం మన రాష్ట్రానికి గర్వకారణమని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లాకు చెందిన ఆది నారాయణ రెడ్డి అయితే మహా సంబరపడిపోయారు. తన జిల్లాకు చెందిన అమ్మాయి హైదరాబాద్ మెట్రో రైల్కు డ్రైవర్గా ఉండటం తన జిల్లాకే గర్వకారణమని, మహిళ లకు అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే ఎన్ని అద్భుతాలయినా సృష్టిస్తారనడానికి ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. గ్రీష్మ తన జిల్లా ప్రతిష్టను జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని సొంతోష పడ్డారు...
దేశ ప్రధానితో పాటు, పలువురు అత్యంత ప్రముఖులు ప్రయాణించిన తొలి మెట్రో రైల్ లోకో పైలెట్‌లుగా నలుగురు యువతులు పనిచేశారు. వీరిలో కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన గోవిందు శంకర్‌రావు కుమార్తె గిరిష్మా. శంకర్‌రావు ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందారు. ఈయన కుటుంబం ప్రస్తుతం వేపరాల గ్రామంలో నివాసం ఉంటోంది. పల్లె కుటుంబం నుండి వచ్చిన గిరిష్మా కడప ప్రభుత్వ మహిళ పాలిటెక్నికల్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లామో చేసి 88 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టంగా అభివర్ణిస్తున్న హైదరాబాదు మహానగర మెట్రో ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన గిరిష్మాను గ్రామస్థులు, జిల్లా వాసులు, రాష్ట్ర ప్రజలు అభినందలు తెలిపారు.