ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సన్నిహితుల ద్వారా, సర్వేల ద్వారా తెలుసుకుంటూ ‘కాయ్‌ రాజా కాయ్‌’ అంటున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ బెట్టింగ్‌ మాఫియా నడుస్తోంది. రూ.3 లక్షల నుంచి బెట్టింగ్‌ ప్రారంభమవుతోంది. ఇక వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లాంటి నగరాల్లో లక్ష నుంచి మొదలవుతోంది. సీటును బట్టి రేటు కూడా మారుతోంది. కొన్ని స్థానాల్లో ఫలానా అభ్యర్థి గెలిస్తే రూ.లక్ష ఇస్తామని, ఓడితే రూ.3 లక్షలు తమకు ఇవ్వాలని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో పందెం కాసిన సొమ్ముకు పది రెట్లు ఎక్కువగా ఇస్తామని ఆఫర్‌ ప్రకటిస్తోంది. ఏపీలోని హాట్‌సీట్లపైనే తెలంగాణ బుకీలు ఎక్కువగా పందేలు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ఏపీలోని తమ స్నేహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. తద్వారా రేటును నిర్ణయిస్తున్నారు.

game 27032019

ముఖ్యంగా మంగళగిరి, గుడివాడ, నగరి, గాజువాక, భీమవరం, సత్తెనపల్లి, హిందుపురం, పులివెందుల, కుప్పం, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నర్సాపురం, కడప పార్లమెంట్‌ స్థానాల గెలుపోటముపైనా తెలంగాణలో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. అంతేకాక, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, బాలకృష్ణ మెజారిటీలపైనా పందెంకాస్తున్నారు. హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గెలుపుపై ఎక్కువగా పందేలు కడుతున్నారు. పవన్‌.. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగారు. పవన్‌ గాజువాకలో ఎంత మెజారిటీతో గెలుస్తారు? భీమవరంలో ఎన్ని ఓట్లు పడతాయనే దానిపై పందేలు జోరుగా కాస్తున్నారు. గాజువాకలో పవన్‌కు అనుకూలంగా, భీమవరంలో ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువగా పందేలు కాస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

game 27032019

అదేస్థానంలో వైసీపీ నుంచి వ్యాపారవేత్త రఘురామకృషంరాజు, టీడీపీ నుంచి వెంకటశివరామరాజు బరిలోకి దిగారు. దీంతొ ఇక్కడ పోటీ ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా ఉండటంతో ఈ స్థానంపై పందెం రాయుళ్లు గురిపెట్టారు. ఇక విశాఖ ఎంపీ స్థానంపైనా పోటీ ఆసక్తికరంగా ఉంది. జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. టీడీపీ నుంచి సినీనటుడు బాలకృష్ణ అల్లుడు భరత్‌, వైసీపీ నుంచి సత్యనారాయణ, బీజేపీ నుంచి పురందేశ్వరీ పోటీ చేస్తుండటంతో.. విశాఖపట్నంలో ఎవరు గెలుస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ స్థానంపైనా ఎక్కువగా పందెం కాస్తున్నారు. ఏపీలో గెలుపోటములపై బెట్టింగ్‌ రాయుళ్లు రహస్యంగా సర్వేలు చేయించారని తెలుస్తోంది. దీనిని బట్టి ఏపీలో ఏ పార్టీకి విజయకాశాలు న్నాయో ప్రాథమిక అంచనాకు వచ్చారు. టీడీపీకి 90-100, వైసీపీకి 60-70 సీట్లు రావొచ్చని, జనసేన 5 స్థానాలకు మించి రావని.. పోలింగ్‌ సమయానికి పరిస్థితులు మారితే తప్ప ఈ అంచనాలో ఎలాంటి మార్పులుండవని హైదరాబాద్‌కు చెందిన ఓ బుకీ చెప్పారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read