ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు, ఎనిమిది మంది ఐఏఎస్‍లకు జైలు శిక్ష విధిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో ప్రధానంగా, గ్రామ సచివాలయ భవనాలను, ప్రభుత్వ ప్రదేశాల్లో నిర్మించటం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా, వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు నేపధ్యంలో, ఆదేశాలు పాటించలేదని హైకోర్టు దృష్టికి రావటంతో, హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఈ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసిన అనంతరం, వీటిని వెంటనే తొలగించాలని హైకోర్ట్ ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశించినా కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోక పోవటంతో, హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ విచారణలో ఇరు పక్షాలు, అంటే అటు పిటీషనర్లు, ఇటు ఐఏఎస్ ల వాదనలు విన్న తరువాత, రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పులో, సంచలన ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. 8 మంది ఐఏఎస్‍లకు జైలు శిక్ష శిక్ష విధించింది. అయితే ఈ జైలు శిక్ష విధించిన వెంటనే, ఈ అధికారులు అందరూ, రాష్ట్ర హైకోర్టు భేషరతుగా క్షమాపణలు చెప్పారు. తాము పొరపాటు చేసాం అని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయం అని చెప్పారు.

hc 31032022 2

హైకోర్టుని వేడుకోవటంతో, ఆ క్షమాపణలు అంగీకరించిన హైకోర్టు, జైలు శిక్ష కాకుండా, వీరు అందరూ కూడా, 12 నెలల పాటు, ప్రతి నెలలో ఒక రోజు, ఎస్సీ ఎస్టీ బీసీకి చెందిన సంక్షేమ హాస్టల్‍కు వెళ్లి , ఒక రోజు మొత్తం అక్కడ సేవ చేసి, అక్కడ ఉన్న పిల్లలతో గడిపి, ఒక రోజు అక్కడ భోజనం మొత్తం కూడా, వాళ్ళ సొంత ఖర్చులతో భరించేలా చూడాలని, రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను ఐఏఎస్ లు అంగీకరించారు. దీంతో హైకోర్టు ఆ శిక్షను ఖరారు చేసింది. ఇందులో ప్రధానంగా సీనియర్ ఐఏఏ ఆఫీసర్ లు ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ జె.శ్యామలరావు, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‍కుమార్‍, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, శ్రీలక్ష్మి, ఎంఎం నాయక్‍, వీరి అందరికీ కూడా హైకోర్టు శిక్ష విధించింది. ఎప్పుడైనా సరే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించి తీరాలని, హైకోర్టు తీర్పుని అధికారులు పట్టించుకోక పోవటం, బాధితులు ఇబ్బందులు పడటంతోనే, ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చిందని హైకోర్టు పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read