ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో చూస్తున్నాం.. పొద్దున్న 6 గంటలకి ఆయన నివాసంలో మొదలయ్యే టెలి కాన్ఫరెన్స్ లతో మొదలయ్యి, రాత్రి 11 గంటలకు సచివాలయంలో జరిగే రివ్యూలతో ఆయన రోజు ముగుస్తుంది... దీనికి ఒక చిన్న ఉదాహరణ... నిన్న పులివెందుల పర్యటనకు వెళ్లారు... రాత్రి 7:30 గంటలకు తిరిగి వచ్చారు.. అధికారులు అంతా రిలాక్స్ అయ్యారు... చలి మొదలైంది... హాయిగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్న టైంలో, ప్రతి వారం బుధవారం అమరావతి మీద జరిగే వీక్లీ రివ్యూ ఉంది అంటూ సమాచారం... దీంతో అందరూ ముఖ్యమంత్రి ముందు ప్రత్యక్షమయ్యారు... రాత్రి పొద్దుపోయే దాకా, జరిగింది ఈ రివ్యూ...
ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు జరిగేవే... లెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగ్ లాగా, ఈయనకు పని చేసుకుంటూ పొతే ఊపు ఎక్కువ అవుతుంది, అధికారులకి మాత్రం పులుసు కారుతుంది... ఇదే విషయం చంద్రబాబుకి చెప్పలేక, ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గర మోర పెట్టుకున్నారు.. డిసెంబర్ 31న ఐఏఎస్ లతో, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఆయన భార్య, నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గున్నారు... ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఇటీవల వినూత్న అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని కొందరు అఖిల భారత సర్వీసు అధికారులు కొత్త సంవత్సరాల వేడుకల్లో ఆమెకో విజ్ఞప్తి చేశారు. మేడమ్... మీరు ప్రతి శనివారం అమరావతికి రావాలని అడిగారట.
సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు... ఇలా సీఎం నిరంతరం ఏదో ఒకపనిలోనే ఉంటున్నారు. 24గంటలూ పనిచేసినా ఆయన హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం మీరొస్తున్నారు కాబట్టి ఆరోజు ఆయన కుటుంబంతో గడుపుతున్నారు. మీరు శనివారం కూడా వస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆ రోజు కనీసం సమయానికి డిన్నర్ చేయగలుగుతాం అని వేడుకున్నారట... ఆదివారం ఎలాగూ విశ్రాంతి కదా... అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా వారు సరదాగా ఆమె దగ్గర ప్రస్తావించారు.. వీరంతా ఎక్కువగా హైదరాబాద్ వారు కావటంతో, వీకెండ్ కల్చర్ ఎక్కువ.... మనకి ఆంధ్రలో ఆదివారం మాత్రమే సెలవు అనే ఉద్దేశంలో ఉంటాం... అక్కడ మాత్రం శని, ఆదివారం కూడా రిలాక్స్ అవ్వాలి అని చూస్తారు... మరి మ్యాడం గారు, చంద్రబాబుకి ఏమి చెప్తారో... చెప్పిన ఆయనా వింటారా... ఆదివారం కూడా వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతూ ఉండే ఆయన, శనివారం కూడా వదులుతారా ?