గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇమిగ్రేషన్ హోదా ఎట్టకేలకు వచ్చింది... కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది... దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ రావడం లాంఛనమే... ఇంటర్నేషనల్ సర్వీసులు నడపటానికి, ఇమ్మిగ్రేషన్ అతి ముఖ్యమైన ఘట్టం.. అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్ పడింది. కొన్ని రోజుల క్రిందట, ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.
ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్ స్టాఫ్ కావాలని, ఈ బృందం డీజీపీ సాంబశివరావుని కోరింది.. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్ ఇమ్మిగ్రేషన్ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు...
ఇమిగ్రేషన్ హోదా రావటంతో ఇక కస్టమ్స్ హోదా కూడా లాంఛనమే. కాగా విజయవాడ నుంచి ముంబాయికి అక్కడి నుంచి దుబాయ్, షార్జాలకు విమాన సర్వీసు నడపటానకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇటీవలే ఆసక్తి చూపించింది. ఇమిగ్రేషన్ హోదా రాకపోతే ముంబాయి వరకు నడపాలని భావించింది. ఇప్పుడు తొలి అంతర్జాతీయ సర్వీసుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి దుబాయ్, షార్జాలకు విమానాన్ని నడపనుంది. ముంబై - విజయవాడ - దుబాయ్ - షార్జా సర్వీసు నడపటానికి ఎయిర్ ఇండియి ఎక్స్‌ప్రెస్ రెడీ గా ఉంది... జనవరి నెలాఖరు నుంచి, అంతర్జాతీయ సర్వీస్ నడపటానికి సిద్ధంగా ఉంది ఎయిర్ ఇండియి ఎక్స్‌ప్రెస్...