నిన్న ఐటి శాఖ రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒక పెద్ద ఇన్ఫ్రా కంపెనీ నుంచి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రాముఖ వ్యక్తికి, 150 కోట్లు ఇచ్చినట్టు, తమ సోదాల్లో తేలింది అంటూ చెప్పిన విషయం, పెను సంచలనంగా మారింది. 150 కోట్లు పుచ్చుకున్న ఆ ప్రముఖుడు ఎవరు ? ఇచ్చిన ఆ ఇన్ఫ్రా కంపెనీ ఏంటి అంటూ, ఇప్పుడు చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులు అంటే, రాజకీయ నాయకులే ఉండే అవకాసం ఉంది. అయితే ఆ ప్రెస్ నోట్ చూసిన వారికి ఆ కంపెనీ ఏంటి, ఇచ్చింది ఎవరికీ అనే విషయం, చూచాయగా తెలుస్తున్నా, బయటకు చెప్పటానికి మాత్రం, ఎవరూ సాహసించలేదు. ఐటి శాఖ డైరెక్ట్ గా కంపెనీ పేరు, తీసుకున్న వ్యక్తీ పేరు చెప్తే తప్ప, ఎవరూ ధైర్యం చేసి, బయట పెట్టే అవకాసం లేదు. అయితే 150 కోట్లు ఒక వ్యక్తీకి ఇచ్చాం అంటూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్పటం అంటే మాములు విషయం కాదు. ఈ ప్రెస్ మీట్ వివరాలు ఇలా ఉన్నాయి.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వెచ్చించిన నిదులను, వేరే మార్గంలో దారి మళ్ళించి, ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రాముఖ వ్యక్తికి 150 కోట్లకు పైగా, హార్డ్ కాష్ అందించినట్టు మాకు సాక్ష్యాలు లభించాయి అంటూ, ఇన్కమ్ టాక్స్ అధికారులు తమ ప్రెస్ నాట్ లో పట్టారు. ఒక ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీ పై, ఈ మధ్య చేసిన ఐటి దాడుల్లో, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవాలలోని 42 చోట్ల సోదాలు చేసి, కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. ఈ వివరాలకు సంబంధించి, ఇన్కమ్ టాక్స్ కమీషనర్ సురభి అహ్లూవాలియా మీడియాకు ప్రకటన విడుదల చేసారు. బోగస్ బిల్లులు ఉపయోగించి, హవాలా మార్గం ద్వారా అవకతవకలకు పాల్పడుతున్న వారి పై, ఐటి దాడులు నిర్వహించామని అన్నారు.
మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టులు/బిల్లుల ద్వారా చేస్తున్న పెద్ద రాకట్ ను కనుగొన్నామని అన్నారు. ప్రభుత్వాలు చెప్పట్టే ఈ ప్రాజెక్ట్ ల నుంచి, హవాలా డీలర్లు ద్వారా దారి మళ్ళించారని అన్నారు. ఇలాంటి కంపెనీ ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో చేపట్టిన ప్రధాన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లలో బోగస్ బిల్లింగ్ చేసింది. వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్య వ్యక్తికి రూ.150 కోట్లకుపైగా నగదు చెల్లింపులు జరిగినట్లు మా సోదాల్లో ఆధారాలు లభించాయి. బోగస్ కాంట్రాక్టుల ద్వారా ఏకంగా రూ.3300 కోట్ల మేరకు నగదును పోగేయడం నుంచి పంపిణీ చేయడం వరకు మొత్తం ఆధారాలతో కనుక్కున్నాము అని, మా సోదాల్లో రూ.4.19 కోట్ల నగదు, 3.2 కోట్లకు పైగా విలువైన బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్ద ప్రాజెక్ట్ లు, 3300 కోట్ల నకిలీ కాంట్రాక్టు చేసే సంస్థ ఏది అని ఆలోచిస్తే, ఈ పజిల్ ఇట్టే అర్ధమవుతుంది. ఐటి అధికారులు అధికారికంగా ఆ పేరు చెప్పే దాకా, ఎవరు అనేది సస్పన్స్ గానే ఉంటుంది.