ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ పట్టటం లేదు... ఏపి ప్రజల మూడ్ అర్ధం కావటం లేదు.. ప్రతి సారి లాగే, ఈ సారి కూడా ప్రజల నాడి పట్టటంలో జగన్ మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. తినే తిండిని పెంటతో పోల్చిన వ్యక్తికి సలాం కొడుతూ, ఆంధ్రా వాడి ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడు జగన్. పదే పదే కేసీఆర్ ను పొగుడుతూ, ఏపి ప్రజల సెంటిమెంట్ తో నాకు పని లేదు అంటున్నారు. తాజగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా ఇవే వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎ్‌సతో కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించిన జగన్.. తాజాగా ఆ పార్టీని వెంటబెట్టుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు తాను తెలంగాణ అధికార పార్టీతో కలిసి ప్రయత్నిస్తానన్నారు.
‘‘రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలలో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకం అవుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే పక్క రాష్ట్రం(తెలంగాణ) 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటాం’’ అని జగన్ అన్నారు. వైసీపీకి ప్రజలు అన్ని ఎంపీ సీట్లూ ఇస్తే అంత బలంగా ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకమవుతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తెలంగాణలోని 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తానంటే ఎందుకు అభ్యంతరం? కేసీఆర్‌ను అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ అన్నారు. "మా మధ్య ప్రజల ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. జాతీయ స్థాయిలో మేం కోరుకునేదేమిటంటే మా మొర ఆలకించడానికి, మా వినతులు పట్టించుకోవడానికి ఎవరో ఒకరుండాలి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వక పోతే ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి? మాకు మద్దతు ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి పోరాడతాం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే, ప్రజల సెంటిమెంట్ ఏ మాత్రం పట్టించుకోకుండా, కేవలం కేసీఆర్ కు భయపడి, ఇలా భజన చేస్తున్నారని, ప్రజలు అనుకుంటున్నారు.