జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రస్తుతం ఎటు పోతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. సొంత పార్టీ నేతలకు కూడా అర్ధం కావటం లేదు. 151 సీట్లు సంపాదించి, రెండేళ్ళలోనే చేతులు ఎత్తేయటం అనేది, బహుసా జగన్ మోహన్ రెడ్డి ఒక్కరికే సాధ్యం అనుకుంటా. ఒక్క వర్గం కూడా ఏపిలో సంతోషంగా లేరు. చివరకు వైసిపీ పార్టీలో వారు కూడా సంతోషంగా లేరు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు కానీ, విద్యార్ధులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగులు కానీ, ఇలా ప్రతి వర్గం రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, వీరి వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. స్వచందంగా ముందుకు వచ్చి, ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, అభివృద్ధి లేదు, రోడ్డులు లేవు, ఇలా ఏది చూసినా దారుణంగా ఉంది పరిస్థితి. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉందో, తాజాగా ఇండియా టుడే కూడా ఒక సర్వే చేసి బయట పెట్టింది. ప్రతి ఆరు నెలలకు మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో దేశంతో పాటు, వివిధ రాష్ట్రాల పరిస్థితి పై కూడా సమాచారం సేకరించారు. అయితే ఇండియా టుడే సర్వేలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, కొన్ని ఆసక్తికర విషయాలు అయితే బయట పడ్డాయి.

it 21012022 2

సొంత రాష్ట్రంలో సియంల గురించి ప్రజల అభిప్రాయం కోరారు. ఇందులో జగన్ మోహన్ రెడ్డికి అసలు జాబితాలో చోటు కూడా దక్కలేదు. మొదటి స్థానం నవీన్ పట్నాయక్ కి దక్కింది, తరువాత మమతా, ఆ తరువాత స్టాలిన్ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, 2020 ఆగష్టు లో, జగన్ మోహన్ రెడ్డి ఇదే లిస్టు లో మొదటి స్థానంలో ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో, సొంత రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అయితే ఇక్కడ వైసిపీకి ఊరట కలిగించే మరో అంశం అయితే ఉంది. సొంత రాష్ట్రంలో ప్రజలు పట్టించుకోక పోయినా, దేశ వ్యాప్తంగా అయితే, జగన్ కు ఆరో స్థానం వచ్చింది. అంటే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు, పక్క రాష్ట్రాల వారిని ఆకర్షించాయి. ఇక్కడ ఏమి జరుగుతుందో వారికి తెలియదు కాబట్టి, కేవలం ప్రకటనలే చూస్తారు కాబట్టి, వారికి అవే కనిపించి, జగన్ కు ఓటు వేయటంతో ఆరో స్థానం వచ్చింది. అయితే సొంత రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి కనీసం జాబితాలో కూడా చోటు లేకుండా చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read