రాష్ట్ర విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా కోలుకుంటుందా అని అందరూ అనుకున్న సమయంలో, ప్రజలు చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. ఆయన తన అనుభవంతో, విజన్ తో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల మీద నిలపటానికి, ఒక ఆక్షన్ ప్లాన్ తయారు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పక్క రాష్ట్రాలతో పోటీ పడేలా చేసి, చాలా విషయాల్లో ఏపి ది బెస్ట్ అనే విధంగా ముందుకు తీసుకుని వెళ్లారు. అటు అభివృద్దిలో, ఇటు సంక్షేమంలో ఏపి దూసుకుపోయింది. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో, ప్రజలు ఒక్క చాన్స్ కు ఓటు వేసి, జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారు. అప్పటి నుంచి మొదలైంది ఏపి పతనం. ఈ పతనం, విభజన గాయాల కంటే ఘోరమైంది. ఇసుక సంక్షోభంతో మొదలు పెట్టి, ఇప్పుడు ప్రతి అంశంలో ఏపి ఎదురీదుతూనే ఉంది. తాజాగా ఇదే విషయం ఇండియా టుడే స్పష్టం చేసింది. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ అఫ్ స్టేట్స్ సర్వేలో, దేశంలో వివిధ రాష్ట్రాలలో, అనేక అంశాల పై ఒక సర్వే చేసి, ప్రతి అంశం పైన ర్యాంకులు ప్రకటించింది. ఇండియా టుడే నిర్వహిస్తున్న ఈ సర్వే ఇప్పటిది కాదు. గత అయిదు ఏళ్ళుగా ఈ సర్వే వస్తూనే ఉంది. ప్రతి ఏడాది లాగే , ఈ ఏడాది కూడా ఇండియా టుడే, ఈ సర్వే చేసి, ఈ సర్వే వివరాలను ప్రచురించింది.
అయితే గతంలో ముక్యమైన రంగాల్లో టాప్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేడు పాతాళంలోకి పడిపోయింది. ఇక రంగాల వారీగా చూసుకుంటే, ముఖ్యమైన రంగాల్లో ఏపి పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయ రంగంలో 12 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అంటే 2019లో చూస్తే ఏపీ 6వ స్థానంలో ఉండేది. ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, 2018లో తెలుగుదేశం హయాంలో మెరుగైన పోలీసింగ్ తో దేశంలో 6వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో 12వ స్థానానికి పడిపోయింది. ఇక సుపరిపాలన విషయానికి వస్తే, చంద్రబాబుగారి హయాంలో పాలనాపరంగా 2018లో నాలుగు, 2019లో 8 ర్యాంకులతో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఒకేసారి 18వ స్థానానికి పడిపోయింది. మొత్తంగా అన్ని రంగాల అభివృద్హి పరంగా చూస్తే, తెలుగుదేశం హయాంలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, 2021లో వైసీపీ హయాంలో 6వ స్థానానికి పడిపోయింది. ఈ నివేదిక చూసిన వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా దిగాజారిపోవటం చూసి, బాధ పడుతున్నారు.