జనవరి 2018 వరకు మోడీ అంటే ఒక మహా శక్తి... అమిత్ షా అంటే అభినవ చాణిక్య అంటూ ఆకాశానికి ఎత్తారు... మోడీని ఎదుర్కునే వారే లేరని, 2019 ఎన్నికల్లో గెలుపు ఖయాం అనే ధీమాతో ఉన్నారు.. నోట్ల రద్దు, జీఎస్టీ అన్నీ మోడీ బ్రాండ్ తో పక్కకు పోతాయని అనుకున్నారు... కాని, ఇక్కడే మోడీ, షా కు ఆంధ్రోడు బ్రేక్ వేసాడు. మా విభజన హామీలు, హక్కులు నెరవేర్చండి అని అడిగితే, నమ్మించి మోసం చేసిన మోడీ పై, ఆంధ్రుడు ఎదురు తిరిగాడు. 5 కోట్ల ఆంధ్రుల తరుపున, చంద్రబాబు ముందుండి, మోడీ పై యుద్ధం ప్రకటించారు. మిత్రపక్షంగా ఉంటూనే, బడ్జెట్ సమావేశాల్లో, ఆందోళన చేసారు.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో దులిపెసారు. ఎన్డీఏ నుంచి బయటకు రావటం, మంత్రుల రాజీనామా, అవిశ్వాసంతో, ఢిల్లీలో సీన్ ఒకేసారి మారిపోయింది. ఫిబ్రవరి నెలలో, తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి, అన్ని విపక్ష పార్టీలు మద్దతు ఇవ్వటంతో, మోడీ పతనం మొదలైంది.

modi 19082018 2

56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మోడీ, ఈ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోలేక, నెల రోజులు పార్లమెంట్ వాయుదా వేసుకుని వెళ్ళిపోయారు. తరువాత కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటిమి, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ అధికారంలోకి రావటం, అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకతాటి పైకి రావటం, ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మోడీని, నీతి అయోగ్ సమావేశంలో నిలదియ్యటం, ఇలా అన్ని విధాలుగా, మోడీ పై ఒత్తిడి పెరిగింది. మోడీని ఎదుర్కోవాలి అంటే, ప్రాంతీయ పార్టీలు అన్నీ కలవాలి అనే వాదం బలపడింది. ఇలా మోడీ పతనానికి, ఆంధ్రోడు నాంది పలికాడు. ఇదే విషయం ఇప్పుడు సర్వేల్లో కూడా తేలింది. అన్ని ప్రాంతీయ పార్టీలు కలిస్తే, మోడీ పని అయిపోయినట్టే అని ఇండియా టుడే సర్వే చెప్తుంది.

modi 19082018 3

జేపీకి మెజారిటీ సీట్లు రావని.. వచ్చినా మోడీకి ప్రధాని ఛాన్స్‌ రాదని ఇటీవల ఓ సర్వే పేర్కొనగా.. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీకి, మోడీకి షాకిచ్చింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే ఎన్డీయేకు కష్టం తప్పదని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ కూటమికి 224 స్థానాలు వస్తాయని, ఎన్డీయే బలం 228కు పరిమితమవుతుందని తేల్చింది. బీజేపీ 194 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, తెలుగుదేశం వంటి పార్టీలు ఏకమైతే, బీజేపీకి 194 సీట్లు మాత్రమే వస్తాయని, బీజేపీ మిత్ర పక్షాలకు 34 సీట్ల వరకూ రావచ్చని, మొత్తంగా 228 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది.

modi 19082018 4

ఇదే సమయంలో మహాకూటమికి 224 సీట్ల వరకూ వస్తాయని, ఇతర చిన్న పార్టీలు అత్యంత కీలకమవుతాయని తెలిపింది. ఇక మహాకూటమి ఏర్పడకుంటే బీజేపీ సొంతంగా 245 సీట్ల వరకూ గెలుస్తుందని, ఎన్డీయేకు 281 సీట్లు రావచ్చని పేర్కొంది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ఎన్డీయేకు 309 స్థానాలు లభిస్తాయని తేలింది. ఇప్పుడు ఆ సంఖ్య 281కి పడిపోవడం గమనార్హం. మొత్తానికి అన్ని ప్రాంతీయ పార్టీలు కలిస్తే, ఇక మోడీ గుజరాత్ వెళ్ళాల్సిందే అని సర్వే తేల్చి చెప్పింది. ఇక మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా 52 శాతం నుంచి 49 శాతానికి తగ్గింది. నిరుద్యోగం అతిపెద్ద సమస్యని 34 శాతం మంది, ధరలు పెరుగుతున్నాయని 24 శాతం మంది, అవినీతి పెను సమస్యని 18 శాతం మంది వెల్లడించడం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read