ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే హంగ్‌ ఏర్పడుతుందని ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ సర్వేలో వెల్లడైంది. ‘మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ పేరుతో చేసిన ఈ సర్వే ఫలితాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి లోక్‌సభలో సీట్లు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ కూటమికి 237 సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడైంది. యూపీఏకి 166, ఇతరులకి 140 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌‌ 272ని ఎన్డీఏ అందుకునే అవకాశాలు లేవు. 2014 కన్నా ఆ కూటమి 99 సీట్లను తక్కువగా వస్తాయట. యూపీఏ కంటే ఎన్డీఏకి ఓట్ల శాతం కాస్త అధికంగా వస్తుంది. యూపీఏకి 2014 కన్నా 106 సీట్లు అధికంగా వస్తాయి. ఈ రెండు కూటముల్లో లేని వారు గత ఎన్నికల్లో కంటే 13 సీట్లను కోల్పోతారు.

indiatoday 24012019

‘మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ ప్రకారం.. ఎన్డీఏ 35 శాతం, యూపీఏ 33 శాతం ఓట్లు కైవసం చేసుకుంటుంది. గత ఎన్నికల్లో భాజపా 282 స్థానాలు గెలుచుకుని మిత్రపక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజార్టీ కోసం యూపీఏయేతర పార్టీల మద్దతు కోసం ఎన్డీఏ ప్రయత్నాలు జరపాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇతరులు కూడా ప్రధాన మంత్రి పదవి కోసం డిమాండ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగి, మేలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 44 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇండియాటుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ సర్వే ఫలితాల్లో వెల్లడైనట్లు యూపీఏకి 166 సీట్లు వస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు అవకాశాలు ఉన్నాయి. యూపీఏ కూటమికి పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మద్దతు తెలపాల్సి ఉంటుంది. 543 సీట్లకు ఎన్నికలు జరగనుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం అవుతాయి.

indiatoday 24012019

ఈ నాలుగు పార్టీలు యూపీఏకి మద్దతు తెలిపితే ఆ కూటమి ఓట్ల శాతం 44 శాతంగా నమోదవుతుంది. అలాగే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లను పొందగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏకి 234 సీట్లు, ఇతరులకి (ఎన్డీఏ, యూపీఏ కూటమిలో లేని పార్టీల వద్ద) 37 సీట్లు ఉంటాయి. ఇరు పార్టీల కూటములకు మద్దతు తెలపని పార్టీలు ఒకవేళ చివరి నిమిషంలో ఎన్డీఏకి మద్దతు తెలిపినప్పటికీ ఆ కూటమికి 271 సీట్లు మాత్రమే దక్కుతాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మరో సీటు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ కూటమికీ మద్దతు తెలపకుండా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి, బీజూ జనతా దళ్‌, అన్నాడీఎంకే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల తరువాత భాజపాకు మద్దతు తెలిపినప్పటికీ యూపీఏనే ముందంజలో ఉంటుంది. ఈ నాలుగు పార్టీలు ఎన్డీఏకి మద్దతు తెలిపితే ఈ కూటమి సీట్ల సంఖ్య 257కి పెరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎవరికీ ఆధిక్యం దక్కని పరిస్థితే ఏర్పడితే ఎన్డీఏ.. ఇతర పార్టీలను తమ వైపునకు ఎలా ఆకర్షించగలదో చూడాల్సిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read