గన్నవరం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడపటానికి దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో విజయవాడ విమానాశ్రయం నుంచి స్లాట్ కోరింది... ఇండిగో నుంచి స్లాట్ ఆభ్యర్ధన రావటమే తరువాయి, విజయవాడ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్లాట్ కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాశ్రయ అధికారులకు ఇంకా ఆధికారికంగా విమాన షెడ్యూలను ఇవ్వలేదు. నెల రోజుల ముందు ఎప్పుడైనా ఇవ్వవచ్చు కాబట్టి సమస్య లేదు. తన షెడ్యూల్ ను అధికారికంగా ఇవ్వ కపోయినా... ఇండిగో సంస్థ అధికారికంగా తన ఆగమనాన్ని ప్రకటించింది.
మార్చి 2 నుంచి విజయవాడ నుంచి దేశీయంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు విమాన సర్వీసుల షెడ్యూలను ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాదకు ప్రతిరోజూ 12.10, 18.45, 21.35 సమయాలలో మూడు ఫ్లైట్స్ బయలుదేరనున్నాయి. ఆలాగే విజయవాడ నుంచి బెంగళూరుకు 10. 15 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటలకు ఒక విమానం నడుస్తుంది. ఇవి ఇక్కడి నుంచి బయలుదేరే సమయాలు మాత్రమే. ఇవే సర్వీసులు గమ్యస్థానాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించటాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి 'ఇండిగో ' సంస్థ దశల వారీగా విమానాలను నడుపుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మొదటి దశ షెడ్యూలను మాత్రమే ప్రకటించడం జరిగింది. మొదటి దశ షెడ్యూల్ ప్రకారం ఈ సంస్థ మొత్తం రానుపోను కలిపి రోజుకు 10 సర్వీసుల చొప్పున విమానాల రాకపోకలు ఉంటాయి.
ఇటీవల 'ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్' సంస్థ దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగరానికి విమాన సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండిగో సంస్థ ప్రకటించిన షెడ్యూల్తో ఇక విజయవాడ ఎయిర్ పోర్టు ఆత్యంత బిజీగా మారిపోనుంది. ఇండిగో భారీ ఆపరేషన్స్ షెడ్యూల్ తో ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా నివ్వెరపోతున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి మోనోపలీగా ఉన్న విమానయాన సంస్థలకు ఇక చెక్ పడనుంది. మోనోపలీ కారణంగా విమాన ధరలు ఆకాశానికంటుతున్నాయి. హైదరాబాద్ కు రూ. 18 వేల టిక్కెట్ ధర పలుకుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణీ కులు బావురు మంటున్నారు. ఇండిగో ప్రవేశంతో విమానయాన సంస్థల మధ్య పోటీ ఏర్పడబోతోంది. ఇండిగో సంస్థ తన ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ. 2097 గా ఛార్జీని నిర్ణయించగా... బెంగళూరు నుంచి విజయవాడకు రూ. 1826గా నిర్ణయిం చింది. విజయవాడ నుంచి చెన్నైకు రూ 1179, చెన్నై నుంచి విజయవాడకు రూ. 1283గా నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్క రూ. 1099, హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1699గా ఛార్జీలను నిర్ణయిస్తూ అధికారికంగా ఇండిగో ప్రకటించింది.