ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండిగో విమానయాన సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది... ఆదివారం నుంచి ఇండిగో తన కార్యకలాపాలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లకు అనుసంధాన విమాన సర్వీసులను మొదలుపెట్టింది. బెంగళూరుకు నుంచి తిరుమలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. అయితే ఇప్పటి వరకు బెంగళూరు నుంచి తిరుపతికి విమానం లేదు. ఇప్పుడు బెంగళూరు నుంచి అనుసంధాన విమానం అతి తక్కువ ధర రూ.1500కే అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

indigo 08012018

రేణిగుంట నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, దిల్లీ, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాతో పాటు ట్రూజెట్‌, ఎయిర్‌కోస్టా, స్పైస్‌జెట్‌లకు తోడుగా ఇప్పుడు ఇండిగో తన సర్వీసులు ప్రారంభించింది. రోజువారీ 13 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక ప్రత్యేక విమానాలు ఉన్నాయి. స్పైస్‌జెట్‌ విమానం రోజూ సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట నుంచి బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా ముంబయి చేరుకుంటుంది. ఎయిర్‌ ఇండియా విమానం రోజూ మధ్యాహ్నం 2.20 నిమిషాలకు రేణిగుంట నుంచి హైదరాబాద్‌ మీదుగా దిల్లీ చేరుకుంటుంది.

indigo 08012018

అయితే తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు... ఎప్పటి నుంచో అదిగో ఇదిగో అంటున్నా, ఇప్పటి వరకు అంతర్జాతీయ సర్వీసులు మొదలు కాలేదు... ఇది తొందరగా మొదలు పెట్టాలి అని ప్రజలు కోరుకుంటున్నారు... చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరుతో పాటు రాయాలసీమ జిల్లాల నుంచి గల్ఫ్‌ వెళ్లే కార్మికులు ఎక్కువ. దీంతో రేణిగుంట నుంచి మొదటిగా దుబాయికి సర్వీసును ప్రారంభించాలన్న డిమాండ్‌ ఉంది. శ్రీవారి దర్శనానికి ఏటా రెండు నుంచి అయిదు లక్షల మేర విదేశీయులు వస్తున్నారు. ఈ సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. విదేశీ విమానాలు నడిపే వీలుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read