రాష్ట్రంలో ప్రముఖ విమానాశ్రయంగా విస్తరిస్తోన్న రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు, చెన్నై వెళ్ళటానికి సర్వీసులు మొదలయ్యాయి... మంగళవారం నుంచి ఇండిగో సంస్థ తన సర్వీసులను రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుండి ప్రారంభించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఇండిగో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం సంజీవ్ రామదాస్ జెండా ఊపి విమాన సర్వీసులను ప్రారంభించారు.

indigo 10012018

రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నైకు, బెంగళూరుకు రెండేసి సర్వీసులు, హైదరాబాద్ కు ఒకసర్వీసులు నడుస్తాయి. ఇప్పటి వరకు రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ట్రూ జెట్, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఇపుడు ఇండిగో సంస్థ కూడా రంగంలోకి దిగడంతో కొత్తగా మరో నాలుగు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇండిగోతో ఎనిమిది విమానాలు రాను, పోను సర్వీసులను నిర్వహించనున్నాయి. దీనికి తోడు ప్రత్యేక కార్లో కూడా ఈ ఎయిర్ పోర్టు నుంచి నిర్వహించే విధంగా ఏర్పాట్ల చేస్తున్నారు.

indigo 10012018

దేశంలోనే ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీ సమీపంలోనే ఉండటంతో పాటు, ఓఎస్టీసీ గెయిల్, జీఎస్పీసీ వంటి సంస్థలు కేజీ బేసిన్లో కార్యకలాపాలు విస్తరించడంతో ఈ ఎయిర్ పోర్ట్ కు బహుముఖంగా దోహదపడుతోంది. ఒక వైపు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఫ్లొరీ కల్చర్, చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం దోహదపడే విధంగా రన్వేను విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఇండిగో పోయిన వారం తన సర్వీసులను తిరుపతి నుంచి ప్రారంభించింది. ఇప్పుడు రాజమహేంద్రవరం నుంచి మొదలు పెట్టింది... మరో నెల, రెండు నెలల్లో గన్నవరం నుంచి, పెద్ద ఎత్తున సర్వీసులు నడపనుంది ఇండిగో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read