గన్నవరం కేంద్రంగా తన విమాన సర్వీసులను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఇండిగో భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ఎయిర్‌బస్‌-320 విమానాల నైట్‌ పార్కింగ్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వాలని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులను కోరింది. ఇండిగో తీసుకుంటున్న తాజా చర్యలతో విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెరగనుంది. దక్షిణాదిలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తర్వాత విజయవాడ విమానాశ్రయాన్ని నాలుగో బేస్‌ స్టేషన్‌గా ఎంచుకుంది. ఇప్పుడు ఇండిగో 4 ఎయిర్‌బ్‌సలను విజయవాడ నుంచి నిర్వహించాలని ప్రతిపాదించింది.

indigo 13062018 2

ఇండిగో ప్రతిపాదన అమల్లోకి రావాలంటే 4 విమానాల నైట్‌ పార్కింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతివ్వాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి ప్రతి రోజు ఢిల్లీకి ఎయిర్‌బస్‌-320 ద్వారా విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో భావిస్తోంది. ఢిల్లీతో పాటు ముంబైకి మరొక సర్వీసును నడపాలని యోచిస్తోంది. మరో రెండు సర్వీసులను ఎక్కడికి నిర్వహించాలనే దానిపై ఇండిగో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపే ఇండిగో 4 ఎయిర్‌ బస్సు లను ఢిల్లీ,ముంబై,బెంగళూరు,చెన్నై లకు నడపాలి నిర్ణయించారు. అందుకే ఇండిగో దక్షిణాదిలో తన నాలుగో బేస్‌ స్టేషన్‌గా విజయవాడ విమానాశ్రయాన్ని ఎంచుకుంది.

indigo 13062018 3

ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి మోనోపలీగా ఉన్న విమానయాన సంస్థలకు ఇక చెక్ పడనుంది. మోనోపలీ కారణంగా విమాన ధరలు ఆకాశానికంటుతున్నాయి. హైదరాబాద్ కు రూ. 18 వేల టిక్కెట్ ధర పలుకుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణీ కులు బావురు మంటున్నారు. ఇండిగో ప్రవేశంతో విమానయాన సంస్థల మధ్య పోటీ ఏర్పడబోతోంది. ఇండిగో సంస్థ తన ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ. 2097 గా ఛార్జీని నిర్ణయించగా... బెంగళూరు నుంచి విజయవాడకు రూ. 1826గా నిర్ణయిం చింది. విజయవాడ నుంచి చెన్నైకు రూ 1179, చెన్నై నుంచి విజయవాడకు రూ. 1283గా నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్క రూ. 1099, హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1699గా ఛార్జీలను నిర్ణయిస్తూ అధికారికంగా ఇండిగో ప్రకటించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read