ఒక జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉండే ముఖ్యమంత్రి వాహనాన్ని, ఒక పది మంది వేరే పార్టీ కార్యకర్తలు వచ్చి అడ్డుకోవటం అంటే, అంత ఈజీగా జరిగే విషయం కాదు. కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భంగా, చాలా మంది చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే, ఇది నిజమే అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ తేల్చింది. ‘బీజేపీ జిల్లా అధ్యక్షుడితో సహా ఇరవై మంది సీఎం కాన్వాయ్‌ని అడ్డగించేందుకు సిద్ధమవుతున్నారు’ అని జిల్లా పోలీసు అధికారులకు సీఎం పర్యటనకు ముందురోజే అందిన సమాచారం. అయితే బీజేపీ అధ్యక్షుడిని ఒక్కరినే గృహనిర్బంధం చేసి మిగిలిన వారి కదలికలపై దృష్టి పెట్టలేదు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లే సీఎం పాల్గొనే సభకు 100 మీటర్ల దూరంలోనే సీఎం వెహికల్‌కి బీజేపీవాళ్లు అడ్డంపడ్డారు.’ ఇదీ ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్‌ నివేదికలోని షాకింగ్ విషయం.

intelligence 09012019 2

ఈనెల 4న కాకినాడ జేఎన్టీయూకే క్రీడా మైదానంలో జన్మభూమి సభకు సీఎం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ సభలో పాల్గొనేందుకు వస్తుండగా.. సీఎం కాన్వాయ్‌ వాహనాన్ని బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం డౌన్‌డౌన్‌.. అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేయగా... సీఎం వాళ్లపై ఫైర్‌ అయ్యారు. మోదీ రాష్ట్రానికి చేసిన మోసంపై నిలదీయండంటూ తన కాన్వాయ్‌ను అడ్డుకున్న వాళ్లకు క్లాస్‌ పీకారు. ఇదేకాకుండా కాకినాడ జేఎన్టీయూ క్రీడా మైదానంలో సభ విషయంలోనూ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడినట్టు కూడా ఇంటిలిజెన్స్‌ నివేదిక పేర్కొన్నట్టు సమాచారం. జన్మభూమి సభ అంటే కలెక్టర్‌, అధికారులే చూసుకుంటారులే అన్నట్టు ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల టీడీపీ కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమైంది.

intelligence 09012019 3

జన్మభూమి అధికారిక కార్యక్రమమే అయినా.. పార్టీపరంగానూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేడర్‌ ఎక్కడికక్కడ తమవంతు సహకారం అందిస్తోంది. అయితే కాకినాడలో జరిగిన జన్మభూమి సభ విజయవంతం చేయడానికి సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలతోపాటు.. మేయర్‌, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోలేదు. జన్మభూమి సభ అంటే అధికారులే చూసుకోవాలని టీడీపీ ప్రజాప్రతినిధులు.. అన్నిచోట్లా టీడీపీ ఎమ్మెల్యేలే జనాన్ని తీసుకువస్తున్నారంటూ అధికారులు ఎవరికి వారు తప్పించుకునే ధోరణితో వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి అటు పోలీస్ అధికారులు, ఇటు పార్టీ నేతలు కలిసి, చంద్రబాబుకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చింది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read